ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సిఫార్సుతో మంజూరైన సీఎం సహాయ

Spread the love

CM’s assistance approved on the recommendation of MLC Tatha Madhusudan

ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సిఫార్సుతో మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్;

ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ సిఫార్సుతో ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసిన 22,16,800/-‌ రూ లు విలువ చేసే వివిధ సీఎం సహాయనిధి చెక్కులను స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు కంకణ బుద్ధులుగా పనిచేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహాయ సహకారాలు అందించకుండా 33 జిల్లాలకు ఒక మెడికల్ కాలేజ్ చొప్పున ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ పూర్తి బడ్జెట్ తో మెడికల్ కాలేజీ ల ఏర్పాటు చేశారని తెలిపారు.

ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ప్రభుత్వాసుపత్రి అందుబాటులోకి తెచ్చే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య సేవలకు పెద్దపీట వేశారని తెలిపారు. వివిధ కారణాల రీత్యా ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం పొందన నిరుపేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసుతో సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నారని తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో నేడు తన సిఫార్సుతో వివిధ వైద్య సేవలు పొంది ఇబ్బందుల్లో ఉన్న వివిధ లబ్ధిదారులకు అక్షరాల 22,16,800/- రూ || లు అందించడం తనకెంతో తృప్తినిచ్చిందని తెలియపరిచారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతు సమన్వయ అధ్యక్షులు నల్లమల్ల వెంకటేశ్వర్లు, జిల్లా యువజన అధ్యక్షులు చింత నిప్పు కృష్ణ చైతన్య , కార్పొరేటర్ కమర్తపు మురళి , మాజీ జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఖమార్ , ముత్యాల వెంకట అప్పారావు , ప్రిండిపోలు సొసైటీ చైర్మన్ రాజ్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page