సీఎం కేసీఆర్.. లక్షల కోట్లు ఎలా సంపాదించావ్?: డీకే అరుణ

Spread the love
CM KCR.. How did you earn lakhs of crores?: DK Aruna

సీఎం కేసీఆర్.. లక్షల కోట్లు ఎలా సంపాదించావ్?: డీకే అరుణ

ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి గతంలో ఉన్న ఆస్తులెన్ని? ఇప్పుడు లక్షల కోట్లకు ఎలా పెరిగాయని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. సీఎం లక్షల కోట్లు ఎలా సంపాదించారో సమాధానం చెప్పాలని ఆమె ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

వచ్చిన వారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చారో? ఇంకా దేనికి వచ్చారో ఎవరికీ క్లారిటీ లేదని, అది ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాత్రమే తెలుసన్నారు. ఎందుకంటే ఇదంతా చేయించింది ఆయనే అని ఆమె విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యం గురించి హాస్యాస్పదంగా ఉందన్నారు.

ప్రెస్ మీట్ అనంతరం మీడియా ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పలేదో సమాధానం చెప్పాలన్నారు. దళితులంటే చాలా గౌరవమని చెప్పిన కేసీఆర్.. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను ఎందుకు సమావేశం నుంచి పక్కకు పంపించారో చెప్పాలన్నారు. సీఎంకు.. దళిత వ్యక్తులు, ఎమ్మెల్యేలు, మంత్రులంటే కూడా విలువ లేదని విమర్శించారు.

ఫాంహౌజ్ లోని నలుగురు ఎమ్మెల్యేలను మాత్రమే కేసీఆర్ వెంట పెట్టుకుని తిరుగుతున్నారన్నారు. ఇదంతా డ్రామా అని ప్రతిఒక్కరికీ అర్థమైందన్నారు. బీజేపీని విమర్శించే అర్హత కేసీఆర్‌కు లేదని, రాజ్యాంగాన్ని మార్చేంతటి ఘనుడు కేసీఆర్ అని ఆమె ఎద్దేవాచేశారు.

ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు కొనుక్కున్న వారేనని అరుణ ఫైరయ్యారు. ముఖ్యమంత్రి వారిని కొనుక్కుంటే తప్పులేదని, అదే తాము రాజీనామా చేయించి గెలిస్తే మాత్రం అప్రజాస్వామ్యమా అని ఆమె నిలదీశారు. ఆడియోలో ఏముందో.. వీడియోలో కూడా అదే ఉందన్నారు. ప్రధాని మోడీ.. కేసీఆర్‌లా ఎక్కడా మోసపు మాటలు మాట్లాడలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. సీఎం తాను ఇచ్చిన హామీల వీడియోలు ఒకసారి చూసుకుంటే నిజాలు ఆయనకే తెలుస్తాయని డీకే అరుణ ఎద్దేవా చేశారు.

Related Posts

You cannot copy content of this page