రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా చందానగర్

Spread the love

అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి కాలనీ కమ్యూనిటీ హాల్ లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరం ను గౌరవ కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతు కంటి వెలుగు సెంటర్ లో జరుగుతున్న వైద్యం వివరాలను వైద్యం కోసం వచ్చే వారి ని అడిగి తెలుసుకున్నారు, డాక్టర్ల కు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగినది అని,ఎటుఅవంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.అదేవిధంగా మానవ అవయవాలలో అతి ప్రధాన అవయవం కన్ను అని, తెలంగాణలోని అంధత్వానికి గురైన అన్ని ప్రాంతాల ప్రజలకు, వారు ఎక్కడా నివసిస్తున్న, ఏమి చేస్తున్నా, ఏ కంటి సమస్య ఉన్న వారైనా నివారణ మార్గాలను,అత్యున్నత నాణ్యత గలిగిన వైద్యం ఖర్చు లేకుండా అందుబాటులోనికి తేవడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని, రాష్ట్రంలో ప్రజలందరికీ కంటి వైద్యం అందుబాటులో నికి తీసుకురావడానికి కంటి వెలుగు ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగినది అని,కావున కంటి సమస్యలున్న వారు మన వద్ద ,మీ దగ్గరి పరిసర ప్రాంతాలలో ఉన్న కంటి పరీక్షా శిబిరంలో పాల్గొనాలని,ఇందులో ఉచితంగా కంటి పరీక్షలు, మందులు, కళ్ళద్దాలు ఇవ్వబడునని ఈ చక్కటి సదాఅవకాశంను ప్రతి ఒక్కరు సద్వినియోగ పర్చుకోవలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకం దేశంలోనే గొప్ప పథకం అని,దేశానికే ఆదర్శవంతమైన పథకం అని , ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న జరిగిన సభలో మాట్లాడుతూ చాలా గొప్ప పథకం, మేము కూడా మా రాష్ట్రాలలో కూడా కంటి వెలుగు పథకం ను ప్రారంభిస్తామని పేర్కొనడం చెప్పడం చాలా గొప్ప విషయం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. కంటి వెలుగు పథకం దేశానికే ఆదర్శం అని , పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని, మొదటి దశ విజయవంతం అయినది అని, వృద్దుల కోసం ,కంటి సమస్యలు ఉన్న వారి కోసం వారి జీవితాలలో వెలుగులు నింపాలనే ముఖ్య ఉద్దేశ్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18 వ తేదిన నుండి రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అని, మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కంటి వెలుగు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగినది అని, కంటి వెలుగు శిబిరాలలో అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని,ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని ,ప్రజలకు సౌకర్యవంతమైన, అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఇవి గాక అవసరమైతే అదనంగా మరిన్ని కేంద్రలను ఏర్పాటు చేస్తామని, 100 రోజుల పాటు ప్రత్యేక శిబిరాలను ఏర్పటు చేసి ప్రజలందరికీ వైద్యం అందిస్తామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు సద్వినియోగపర్చుకోవలని, కంటి వెలుగు సెంటర్ లో ఉచిత కంటి పరిక్షలు ,చేసి అవసరమైన వారికి కళ్ళద్దాలు, పంపిణీ చేస్తారు అని, అవసరమైన వారికి కంటి అపరేషన్ లు నిర్వహించడం జరుగుతుంది అని గతంలో మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమంలో మన శేరిలింగంపల్లి నియోజకవర్గంలో దాదాపు 1,83,000 మందిని పరిశీలించి 40000 మందికి కళ్ళ అద్దాలు ఇవ్వడం జరిగినది ప్రభుత్వ విప్ గాంధీ గారు తెలియచేసారు.

అదే స్పూర్తితో రెండో దఫా కంటి వెలుగు ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలో అవసరం ఉన్న అందరికీ కంప్యూటరైజ్డ్ పరీక్షలు నిర్వహించి, పరీక్షల తో పాటు ఉచితంగా, మందులు, కళ్లద్దాలు ఉచితంగా ఇస్తున్నాం..ప్రతి కళ్ళ అద్దాల జోడులకు బార్ కోడ్ కూడా పెడుతున్నాం.ఎవరివి వారికే చేరేలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం.

ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు క్యాంపులు నిర్వహణ ఉంటుంది, మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో 8 మంది వైద్య సిబ్బంది ఉంటారు. ఒక అప్టో మెట్రిస్ట్, ఒక సూపర్ వైజర్, ఇద్దరు ఏ ఎన్ ఎం, ముగ్గురు ఆశా, 1 డీఈవో టీంలో సభ్యులుగా ఉంటారు.*

ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్ పూర్తి చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు అయ్యేలా అందరం కృషి చేద్దాం.అధికారులు,కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధుల చురుకైన భాగస్వామ్యం తోనే కార్యక్రమం విజయవంతం అవుతుందని సీఎం కేసీఆర్ ఉద్దేశ్యం కాబట్టి, అందరం కలిసి పని చేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు హరీష్ రెడ్డి, సందీప్ రెడ్డి, నరేందర్ బల్లా మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page