By the end of April, Minister Talasani has directed to complete the works of Begumpet Canal
ఏప్రిల్ నెల చివరి నాటికి బేగంపేట నాలా పనులను పూర్తి చేయాలి మంత్రి తలసాని ఆదేశాలు
సాక్షిత సికింద్రాబాద్ : సికింద్రాబాద్ బేగంపేట నాలా సమగ్ర అభివృద్ధి పనులనుఏప్రిల్ నెల చివరి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.ఎస్ఎన్ డి పి కార్యక్రమం క్రింద 45 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బేగంపేట నాలా అభివృద్ధి,నిర్మాణ పనులను బేగంపేట లోని బ్రాహ్మణవాడిలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధికారులతో కలిసి పరిశీలించారు.
పనులు జరుగుతున్న తీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.పూడిక తొలగింపు, తాత్కాలిక రోడ్డు నిర్మాణం తదితర పనులు నెమ్మదిగా సాగుతుండటంపట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నాలా కు ఎగువ నుండి వచ్చే వరదనీరు సమీపంలోనివడ్డెర బస్తీ,ప్రకాష్ నగర్,బ్రాహ్మణ వాడి,అల్లంతోట బావి తదితర కాలనీలు,ఇండ్లలోకి చేరి ప్రజలు అనేక అవస్తలు పడుతున్నారని,వారికి ఆ సమస్యను దూరం చేయాలనే లక్ష్యంతోనాలా అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. అందులో భాగంగానే వరదనీరు రాకుండా నివారించేందుకు నాలా కు కుడి వైపున 634 మీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ ను నిర్మించడం జరిగిందని,660 మీటర్ల మేర ఉన్న రిటైనింగ్ వాల్ ఎత్తు పెంచడం జరిగిందని చెప్పారు.
అదేవిధంగాఎడమ వైపున 854 మీటర్లమేర నూతన రితైనింగ్ వాల్ నిర్మాణం,386 మీటర్ల మేర ప్రస్తుతం ఉన్న రిటైనింగ్ వాల్ ఎత్తు పెంచి నిర్మించడం జరిగిందని వివరించారు.ప్రతిపాదించి చేపట్టిన పనులను అన్నిఅనుకున్నసమయంలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్, ఎస్ ఎన్ డి పి,విద్యుత్ తదితర శాఖల అధికారులు పరస్పర సహకారంతో పనులను వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.అదేవిధంగా నాలా వెంట ఉన్న కాలనీలలో సీవరేజ్, వాటర్ లైన్ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ పనులన్నీ పూర్తయితే ఎన్నో సంవత్సరాల నుండి ఆయా ప్రాంతాల ప్రజలు పడుతున్న వరదముంపు సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని చెప్పారు.మంత్రి వెంట కార్పొరేటర్ మహేశ్వరి, ఎస్ఎన్ డిపి ఈఎన్సీ జియా ఉద్దిన్, సిఇ కిషన్, వాటర్ వర్క్స్ డైరెక్టర్ ఆపరేషన్స్ కృష్ణ,ఎస్ఎన్ డి పిఎస్సీఇ బాస్కర్ రెడ్డి, ఈఈ సుదర్శన్,వాటర్ వర్క్స్ జీఎంరమణారెడ్డి,ఎలెక్ట్రికల్ డిఈ సుదీర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ క్రిస్టోఫర్ తదితరులు ఉన్నారు.