Broken ribs mean help
రిబ్స్ విరిగి సహాయం కోసం అర్థిస్తున్నారు..
కరోనా టైంలో 30కిపైగా ప్లాస్మాను దానం చేసిన వ్యక్తి
సాక్షిత షాద్ నగర్ : కరోనా కష్టకాలంలో దేశంలోనే మొట్టమొదటగా ఫ్లాస్మాదానం చేసిన వ్యక్తికి కష్టమొచ్చింది. అనుకోని ప్రమాదం ఆయనకు ప్రాణాంతకమైంది… అప్పుడు వందల మంది ప్రజలను ప్లాస్మా ఇచ్చి ఆదుకున్న వ్యక్తే… ఇప్పుడు ప్రమాదానికి గురై… సహాయం కోసం అర్థిస్తున్నాడు ఆదుకోండి… వివరాల్లోకి వెళ్తే…
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ఉండే ఉదయ్ దేశంలోనే మొట్టమొదటగా ప్లాస్మా దానం చేసి కరోనాతో పోరాడుతున్న వారికి జీవన దానం చేశాడు. ఒక్క సారి రెండు సార్లు కాదు.. ఏకంగా 30 సార్లకు పైగా తన ప్లాస్మాను దానం చేసి ఎందరో జీవితాలను కాపాడగలిగాడు ఉదయ్. కరోనా కాలంలో ఇంటి బయటకు రావాలన్నా ప్రాణాలు పోతాయని భయపడుతున్న వేల అందరికోసం తను ఉన్నానని నిలబడ్డాడు. ఇప్పుడు మీ సహాయం కోసం హాస్పిటల్ లో ఎదురు చూస్తున్నాడు.
అయితే ఉదయ్ కి ఐదు రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగింది. రిబ్స్ విరిగిపోయాయి.. ప్రస్తుతం హాస్పిటల్ ప్రాణాలతో పోరాడుతున్నారు. మధ్యతరగతి కుటుంబం కావడంతో డాక్టర్లు అడిగిన ధనాన్ని ఇవ్వలేకపోతున్నారు. ఉదయ్ ప్రాణాలు నిలబడాలంటే 25 లక్షలు కావాలి… దయున్న వాళ్లు ఉదయ్ ప్రాణాన్ని కాపాడటానికి తమ వంతు ధన సహాయం చేయండని ఆ మధ్యతరగతి కుటుంబం వేడుకుంటుంది. ఇలాంటి ఒక్క ఉదయ్ ను కాపాడితే మరెంతో మందికి భవిష్యత్తులో ఆయన సహాయం చెయ్యగలడు. మంచి మనిషిని కాపాడుకుందాం…
ఆయన గుగుల్ పే / ఫోన్ పే నెంబర్ కు మీకు తోచినంత సహాయం చేయగలరు గుగుల్ పే / ఫోన్ పే నెంబర్.. 9052070280