SAKSHITHA NEWS

Book reading is one of the habits of successful leaders of the world.

పుస్తక పఠనం ప్రపంచంలోని విజయవంతమైన నాయకుల అలవాట్లలో ఒకటి…

“స్పీక్ ఏ బుక్” కాంపిటీషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 120 పాఠశాలల్లో నిర్వహించనున్న పోటీలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ భగత్ సింగ్ నగర్ జెడ్పిహెచ్ఎస్ లో 26 జనవరి రాజ్యాంగ అవతరణ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ “స్పీక్ ఏ బుక్” కాంపిటీషన్ ను లాంచ్ చేశారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని 120 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే  ఈ పోటీల లక్ష్యము మరియు ఆవశ్యకత వివరించే కరపత్రము మరియు సర్టిఫికెట్ ను ఆవిష్కరించారు. విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచటానికి మరియు వారిలో భావవ్యక్తీకరణ సామర్థ్యం పెంచటానికి ఈ పోటీలను 5E ఛాంపియన్ ప్రొఫైల్ అనే సంస్థ ప్రతిపాదించింది.

ఈ మేరకు ఎమ్మెల్యే స్పందించి నియోజకవర్గంలోని 120 పాఠశాలల్లో నిర్వహించేందుకు కరపత్రాలు, సర్టిఫికెట్స్, బహుమతులు అందజేసేందుకు ముందుకు వచ్చారు. “స్పీక్ ఏ బుక్” పోటీల ద్వారా వారు ఆ ఛాలెంజ్ ను కొంత వరకు అధిగమించ గలుగుతారు. వారు ఎంచుకున్న పుస్తకంపై, విద్యార్థి 5 నిమిషాలు మాట్లాడాలి.

విద్యార్థుల తల్లదండ్రులందరికీ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ నమస్కరిస్తూ…
 
మన విద్యార్థుల అపార ప్రతిభాపాటవాలను ‘గ్లోబల్ ఛాంపియన్స్‘గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమ వివరాలు తెలియజేసేందుకు మరియు మీ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ మీకు ఈ లేఖ రాస్తున్నాను.


 
మన ప్రతీ విద్యార్థికీ ఏదో ఒక రంగంలో సూపర్ టాలెంట్ ఉంటుంది. అది పూర్తి స్థాయిలో వినియోగింపబడటం లేదు అండర్ యుటిలైజేషన్ ఆఫ్ పొటెన్షియల్, ఇది మన దేశంలో ఒక తీవ్ర సమస్య. ఈ సమస్యను పరిష్కరించటానికి 5E సంస్థ ఒక ఇన్నోవేషన్ మోడల్ ను రూపొందించటం జరిగింది.bఅండర్ యుటిలైజేషన్ కు కారణాలు రెండు:  (i),  మన స్టూడెంట్స్ కు ఎడ్యుకేషన్ తర్వాతి దశల మీద పూర్తి అవగాహన లేక వారు స్ట్రగుల్ అవుతున్నారు. (ఎంప్లాయిబిలిటీ, ఎఫిషియన్సీ, ఎంపతి, ఎథిక్స్). (ii), మన విద్యార్థులు రెజ్యూమ్ (బయో డేటా) ప్రిపరేషన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ లో మొదలు పెడుతున్నారు. అది చాలా లేట్ ఇన్ ద గేమ్.

మన విద్యార్థులలో అకడమిక్  ఎక్సలెన్స్ కు మించి, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ మరియు పర్ఫార్మన్స్ ఎక్సలెన్స్ సాధించడానికి, సెల్ఫ్ అవేర్‌నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం, సెల్ఫ్ ప్రొఫైలింగ్ పాఠశాల స్థాయిలోనే ప్రారంభింపజేయాలని, 18 అంశాలతో ఒక ఫుల్ స్పెక్ట్రంగా, చాంపియన్ ప్రొఫైల్ ను (CP) రూపొందించటం జరిగింది. చాంపియన్ ప్రొఫైల్ మన విద్యార్థుల ఆలోచనా పరిధిని పెంపొందించి, వారి టైమ్ & పొటెన్షియల్ ను పూర్తి స్థాయిలో వినియోగింపబడటంలో మరియు  వారు గ్లోబల్ ఛాంపియన్‌గా ఎదగడానికి దోహదపడుతుంది.
 
చాంపియన్ ప్రొఫైల్ లోని ఒక అంశము పుస్తక పఠనం. పుస్తక పఠనం అనేది ప్రపంచంలోని విజయవంతమైన నాయకుల అలవాట్లలో ఒకటిగా పరిగణింపబడుతుంది. పుస్తక పఠనం మన ఆలోచనా పరిధులను విస్తృతం చేస్తుంది మరియు స్థానిక వాతావరణాన్ని మించి ప్రపంచ దృశ్యాన్ని అందిస్తుంది. మన లక్ష్యాలను సాధించడంలో ఒక ఉత్ప్రేరకంగా సహాయపడుతుంది.

విద్యార్థులలో పుస్తక పఠన అలవాటును పెంపొందించడానికి, 5E  సంస్థ వివిధ సందర్భాలలో పాఠశాలల్లో “స్పీక్ ఎ బుక్” పోటీని నిర్వహిస్తున్నదని నా దృష్టికి వచ్చింది. నేను ఒక పుస్తక ప్రేమికునిగా, ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో చేపడుతున్నాను. 26 జనవరి రాజ్యాంగ అవతరణ దినోత్సవం, “స్పీక్ ఏ బుక్” కాంపిటీషన్ కు సరియైన సందర్భంగా భావించి, ఈ కార్యక్రమము నిర్వహిస్తున్నాము.   
 
26 జనవరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో,  “స్పీక్ ఏ బుక్” కంపెటిషన్ నిర్వహించాల్సిందిగా అన్ని పాఠశాల యాజమాన్యాలకు ప్రతిపాదిస్తున్నాను. తాను ఎంచుకున్న పుస్తకం గురించి విద్యార్థి 5 నిమిషాలు ప్రసంగిస్తారు.

మొదటి ముగ్గురు విజేతలకు బహుమతులు & పార్టిసిపంట్స్ కు సర్టిఫికెట్స్ బహుకరింపబడతాయి. ఒక్కో విద్యార్థి ఒక పుస్తకం గురించి ప్రసంగించిన 5 నిమిషాలలో, తోటి విద్యార్థులందరూ ఆ పుస్తకంలోని అంశాలు తెలుసుకోగలుగుతారు. మన పిల్లలు  పుస్తకాలపై ప్రసంగిస్తున్నప్పుడు, వినటం మనకు ఎంతో ఆనందంగా ఉంటుంది. నేను కూడా కొన్ని స్కూల్స్ లో పాల్గొంటాను.
 
మీ పిల్లల స్కూల్ లో, “స్పీక్ ఏ బుక్” కాంపిటీషన్ కు హాజరయ్యి, మన  విద్యార్థులను ప్రోత్సాహించాల్సిందిగా తల్లిదండ్రులందిరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే, ఈ ప్రయత్నం/ కార్యక్రమం గురించి మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను.


SAKSHITHA NEWS