నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లింకు రోడ్లు, చెరువుల సుందరీకరణ

Spread the love

Beautification of link roads and ponds under Nizampet Municipal Corporation

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లింకు రోడ్లు, చెరువుల సుందరీకరణ పనులపై ఎమ్మెల్యే సమీక్ష…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హెచ్ఆర్డిసీఎల్ వారు చేపడుతున్న లింకు రోడ్లు, హెచ్ఎండిఏ చేపడుతున్న చెరువుల అభివృద్ధి పనులపై ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రగతి నగర్ లోని మున్సిపల్ కార్యాలయం వద్ద స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి , ఇంచార్జీ కమిషనర్ రామకృష్ణా రావు , డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ మరియు ఆయా విభాగాల అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు లింకు రోడ్ల అభివృద్ధికి మంజూరైన నిధులతో పనులు వేగంగా చేపట్టి పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అదే విధంగా చెరువుల సుందరీకరణలో భాగంగా బైరం చెరువు, తుర్క చెరువుల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టి పనులు త్వరలోనే ప్రారంభించేలా సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో ఆయా విభాగాల అధికారులు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page