SAKSHITHA NEWS


Asha’s services are unforgettable..Minister Puvvada.

ఆశల సేవలు మరువలేనివి..మంత్రి పువ్వాడ.

జిల్లా 3వ మహా సభలో మంత్రి పువ్వాడ.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఆశా వర్కర్‌లు అందిస్తున్న సేవలు ఎనలేనివని, వారు అందిస్తున్న సేవలు మరువలేనివని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బీ అర్ ఏస్ కే వి
యూనియన్ అధ్వర్యంలో గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల సంఘం (ఆశా) ఖమ్మం జిల్లా 3వ మహా సభకు వీడియో సు కాలని లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ సభకు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు.


ప్రజలకు ఆశాలు అందిస్తున్న సేవలు మరువలేనివి, సొంత అక్క గా చెల్లిగా ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలు ఆయా ఇంటింటికి అందిస్తు వారి ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నారని అన్నారు.
ముఖ్యంగా కొవిడ్ కాలంలో మీరు అందించిన సేవలు మరువలేనివి, మీరు లేకుంటే కొవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో లక్షల మంది ప్రాణాలను కాపాడి ఆశాల సేవలు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టిందని చెప్పారు.

కార్పొరేట్‌ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా పరీక్షలు, మందులు అందజేయబడుతున్నాయ‌ని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అంతే కాకుండా పేదలు అత్యధికంగా నివసించే బస్తీ ల‌లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి పేదల ముంగిటికి ప్రభుత్వ వైద్య సేవలు తీసుకొచ్చినట్లు చెప్పారు.

ఇందులో కూడ సూమారు 56 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని తెలిపారు. పైవేటు ఆసుపత్రులకు వెళ్లి కేవలం పరీక్షలు కోసం వేలాది రూపాయాలు ఖర్చు చేయాల్సి వస్తుందని, పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నామని అన్నారు.

పేద, మధ్య తరగతి ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కోట్లాది రూపాయాల వ్యయంతో అత్యాధునిక ప రికరాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల అమలు లో స్మార్ట్ ఫోన్‌లు ఆశా వర్కర్‌లకు ఎంతో ఉపయోగపడుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టి ఆర్ ఎస్ కె వీ రాష్ట్ర నాయకులు రాంబాబు, జిల్లా అధ్యక్షురాలు కరుణ, నాయకులు పాల్వంచ కృష్ణా, పాషా తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS