SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 15 at 2.24.53 PM

రూ.2.20 కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన కార్యక్రమాలు..
నిజాంపేట్ మున్సిపల్ కార్పోరేషన్ ని మోడల్ కార్పొరేషన్ గా తీర్చిదిద్దుతాం :- ఎమ్మెల్యే కె.ఫై.వివేకానంద ..


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 90వ రోజు “ప్రగతి యాత్ర”లో భాగంగా నిజాంపేట్ 26వ డివిజన్ లో ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి , డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ , కమిషనర్ రామకృష్ణ రావు , కార్పొరేటర్ రాఘవేంద్ర రావు తో కలిసి పాదయాత్ర చేశారు.
ఇందులో భాగంగా రూ.రూ.2.20 కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు. బృందావన్ హిల్స్ పార్క్ స్థలాన్ని సందర్శించి, 80 లక్షల వ్యయంతో రాజధాని స్కూల్ నుండి ఆర్జికే ఎస్ టి పీ వరకు, బృందావన్ హిల్స్ పార్క్ నుండి రాజధాని స్కూల్ వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం, జీ ఆర్ సి ప్రైడ్ నుండి ఎస్ వి ఎస్ బృందావన్ ఇండిపెండెంట్ హౌసెస్ వరకు, మరియు ప్లాట్ నెం.5,8 శ్రీ వెంకట సాయి బృందావన్ నుండి గ్రీన్ ఫీల్డ్స్ గేటు వరకు నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు..
అదే విధంగా కోటి 15 లక్షల వ్యయంతో హరిశ్రీ ఎవెన్యు ప్లాట్ నెం. 33 నుండి మధుర నగర్ కమాన్ వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం, మధురానగర్ కమాన్ నుండి మున్సిపల్ పార్కింగ్ షెడ్ (స. నెం.87&88)వరకు సీసీ రోడ్ ప్రారంభోత్సవం,మరియు 25 లక్షల వ్యయంతో క్రీడా ప్రాంగణం మరియు ప్రశాంతి హిల్స్ పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ డివిజన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులు, కావాల్సిన మౌళిక సదుపాయాలు,వంటివి,పెండింగ్ లో ఉన్న పనులు సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అక్కడే ఉన్న అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, బి.ఆర్.ఎస్. పార్టీ నాయకులు, కాలనీల సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS