హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ లో నివసించే ప్రముఖ వ్యాపారవేత్తలు ఆప్తబ్

Spread the love

సాక్షిత : హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ లో నివసించే ప్రముఖ వ్యాపారవేత్తలు ఆప్తబ్ మరియు మహ్మద్ ఇస్మాయిల్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారుడు మిద్దెల మల్లారెడ్డి ఆధ్వర్యంలో వివేకానంద నగర్ లోని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నివాసంలో వారికి బీఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి బీఆర్ ఎస్ పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించిన ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలోకి రావడం సంతోషకరమైన విషయం అని, ప్రజల చూపు అంతా బీఆర్ఎస్ వైపే ఉంది అని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరుగుతుంది అని, ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఆశీర్వాదిస్తున్నారని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు సైతం తమ వెంట రావడం పార్టీకి శుభసూచకం అన్నారు.ఈ రోజు పోచయ్య బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, మరియు వారి ఆశీర్వాదం తో, వారి సూచనలు,సలహాలతో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ తెలియచేశారు.. ప్రతి ఒక్కరు బీఆర్ ఎస్ పార్టీ పటిష్టతకు సైనికుడిగా పనిచేయాలని, బీఆర్ ఎస్ పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు, అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని, ప్రతి ఒక్కరం కష్టపడి బంగారు తెలంగాణలో భాగస్వాములం అవుదామని గాంధీ పేర్కొన్నారు. అదేవిదంగా ముఖ్య మంత్రి కెసిఆర్ బంగారు తెలంగాణ నిర్మాణము కోసం ఎంతో కృషి చేస్తున్నారని ,మైనార్టీ ల సంక్షేమానికి కృషి చేస్తున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని, అనేక సంక్షేమ పథకాల తో అలరిస్తున్నారు అని, అందులోభాగంగా కల్యాణ లక్ష్మి /షాదీ ముబారక్ షాదీ ముబారక్ ద్వారా పేదింటి ఆడపిల్లకు 1 ,00 ,116 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని , ఆసరా పింఛన్లు ,ఒంటరిమహిళా పింఛన్లు,కెసిఆర్ కిట్,కంటి వెలుగు ,రైతు బంధు ,రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు,మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు వంటి అనేక గొప్పసంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ దేనని ప్రభుత్వ విప్ గాంధీ తెలియజేసారు. ప్రతి ఒక్కరు సైనికుడిగా పనిచేయాలని, తెరాస పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు, అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని, ప్రతి ఒక్కరం కష్టపడి బంగారు తెలంగాణలో భాగస్వాములం అవుదామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిద్దెల మల్లారెడ్డి, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page