అగ్ని ప్రమాదాల నియంత్రణకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలి

Spread the love


All precautionary measures should be taken to control fire hazards

అగ్ని ప్రమాదాల నియంత్రణకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలి.

-జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

అగ్ని ప్రమాదాల నియంత్రణకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవన భద్రతా చర్యలు, అగ్నిమాపక చర్యలు తప్పనిసరిగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఇటీవల హైదరాబాద్ లో అగ్నిప్రమాదాలు సంభవించి మరణాలు జరిగినట్లు, అలా జరగకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటే ఆస్తి, ప్రాణ నష్టం నివారించ వచ్చని ఆయన తెలిపారు. ఢిల్లీ లో సినీమా హాల్లో ప్రమాదం సంభవించి పెద్దఎత్తున ప్రాణ నష్టం జరిగినప్పుడు, సుప్రీంకోర్టు ప్రమాదాల నివారణకు మార్గదర్శకాలు చేసినట్లు వాటిని అమలయ్యేలా చూడాలన్నారు.

5 అంతస్తులకు మించి నిర్మాణం ఉంటే ఫైర్ అనుమతి ఉండాలని, వాణిజ్య, అపార్ట్మెంట్, మాల్స్, పాఠశాలలు, ఆసుపత్రులు అగ్నిమాపక చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్న ప్రదేశాల్లో, పురాతన భవనాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. 500 చదరపు అడుగుల పైబడి నిర్మాణాలకు అగ్నిమాపక ధ్రువీకరణ పొందేలా చూడాలన్నారు.

సెల్లార్ లలో ఎటువంటి కట్టడాలు కానీ, నిల్వలు గాని ఉంచకుండా చర్యలు తీసుకోవాలని, టౌన్ ప్లానింగ్, పోలీస్ వారు సంయుక్త తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. రోడ్లు, చెరువులు, జాతీయ రహదారులపై ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.

సమావేశంలో ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ, నగరంలో 7 సినిమాహాళ్లు, 16 పాఠశాలలు/కళాశాలలు, 15 ఫంక్షన్ హాళ్లు, 21 మాల్స్ ని గుర్తించినట్లు, అగ్నిమాపక నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వి.పి. గౌతమ్, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, జెడ్పి సిఇఓ వి.వి. అప్పారావు, జిల్లా అగ్నిమాపక అధికారి జయప్రకాష్, మునిసిపల్, రెవిన్యూ, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page