రాష్ట్రంలోని పేద కుటుంబాలకు అండగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్.

Spread the love

KCR is the only Chief Minister who stands by the poor families of the state.

రాష్ట్రంలోని పేద కుటుంబాలకు అండగా ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్

రూ.21 లక్షల విలువ చేసే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి చెందిన 21 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు రూ.21,02,436/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి , డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ , ఇంఛార్జి కమిషనర్ రామకృష్ణా రావు , ఎమ్మార్వో సురేందర్ తో కలిసి ప్రగతి నగర్ మున్సిపల్ కార్యాలయం వద్ద పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి వరంలాంటిదని అన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఅర్ ప్రవేశ పెట్టిన సంక్షేమపథకాలు దేశానికే ఆదర్శం అన్నారు. పేదల కోసం షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ వంటి అనేక పథకాలను అర్హులైన ప్రజలు ఆస్వాదిస్తున్నారని పేర్కొన్నారు.

గత ప్రభుత్వాలు ఆడ పిల్లల పెళ్లిళ్ల కోసం ఏనాడూ ఆలోచించలేదని, ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయాలంటే త‌ల్లిదండ్రులకు త‌ల‌కు మించిన భారంగా ఉండేది, కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆడపడుచులకు అండగా ఉంటూ వారి పిల్లల పెళ్లిళ్లకు లక్ష నూట పదహారు రూపాయలు అందించి పేద కుటుంబంలో ఒకరిగా ఉన్న ఏకైక ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page