లబ్ధిదారులకు అలెర్ట్.. ఈ సారి 1వ తేదీన పింఛన్ రాదు

Spread the love

వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచి కక్ష కట్టారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటిజన్‌ ఫర్‌ డెమొక్రసీలో ఉండేది చంద్రబాబు మనుషులే అని చెప్పారు.

ఎన్నికల వేళ పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను పక్కన పెడుతూ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వారితో సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు పంపిణీ చేయించవద్దని CEO ముకేశ్‌ కుమార్‌మీనా ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎలక్షన్ కోడ్‌ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ట్యాబ్‌, మొబైల్‌ తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పెన్షన్ల పంపిణీకి సంబంధించి కీలక కామెంట్స్ చేశారు. పెన్షనర్లు ఆందోళన పడాల్సిన అవసరం లేదని… సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు అందజేస్తామన్నారు. మూడో తేదీన పెన్షన్లు అందిస్తామని.. లబ్ధిదారులు సచివాలయానికి వెళ్లి పింఛన్లు తీసుకోవాలని సూచించారు.

వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మొదట్నుంచి కక్ష కట్టారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటే చంద్రబాబు గిట్టదన్నారు. వాలంటీర్ల వ్యవస్థ గురించి కోర్టుకు వెళ్లిన సిటిజన్‌ ఫర్‌ డెమొక్రసీలో ఉండేది చంద్రబాబు మనుషులే అని చెప్పారు. చంద్రబాబు ఇంగిత జ్ఞానం కూడా లేకుండా.. వృద్ధులకు, వికలాంగులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబుది మోసపూరిత రాజకీయమన్నారు. పవన్‌ను చంద్రబాబు మింగేస్తాడని ముందే చెప్పామని.. పవన్‌కు ఇచ్చిన సీట్లలోనూ చంద్రబాబు మనుషులే ఉన్నట్లు సజ్జలు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page