Actions should be taken without any difficulties for the devotees
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి…
చిత్తారమ్మ జాతర ఏర్పాట్లపై అధికారులతో ఎమ్మెల్యే సమావేశం…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం చిత్తారమ్మ జాతర ఈనెల 20 నుండి 27వరకు నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆలయం వద్ద అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ యేటా ఎంతో ఘనంగా జరిగే చిత్తారమ్మ జాతర ఈ సారి కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. నగర నలుమూలల నుండి పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను అధికారులు చేపట్టాలన్నారు.
ఆలయ పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారాలు లేకుండా పరిశుభ్రపరచాలని, కరెంటు, మంచినీటి సమస్య లేకుండా చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా మళ్లింపు చర్యలు చేపట్టాలని ట్రాఫిక్ పోలీసులను, దొంగతనాలకు తావు లేకుండా మహిళలకు రక్షణ కల్పించేలా నిఘా నేత్రాలను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
ఈ సమావేశంలో బాలనగర్ ఏసీపీ గంగారాం, జీడిమెట్ల సీఐ పవన్, ఈఈ గోవర్ధన్, డిఈఈ రూపాదేవి, డిఈ రఘుపతి రెడ్డి, డిజిఎం అప్పల నాయుడు మరియు ఆలయ కమిటీ చైర్మన్ అంతయ్య గౌడ్, జనరల్ సెక్రెటరీ బాల్ రాజ్, కమిటీ సభ్యులు బుచ్చయ్య, పెంటారెడ్డి, ఆర్.నర్సింహా, జి.నర్సింహా, ఆర్.సత్తయ్య, కృష్ణా రెడ్డి, అడ్వైజర్లు ఇంద్రసేన గుప్త, ఇంద్ర సేన రెడ్డి, నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్,
పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, రుద్ర అశోక్, సీనియర్ నాయకులు రషీద్ బైగ్, కస్తూరి బాల్ రాజ్, పెద్దబాల్ అంజన్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు సంధ్యారెడ్డి, ఆబిద్, నవాబ్, ఇబ్రహీం, సింగారం మల్లేష్, దూలప్ప, ఇమ్రాన్ బైగ్, శివ ముదిరాజ్, హమీద్ తదితరులు పాల్గొన్నారు.