సీఎం లకు ఎంపీ నామ ఘన స్వాగతం

Spread the love

సీఎం లకు ఎంపీ నామ ఘన స్వాగతం

సీఎం కేసీఆర్ తో కలసి ప్రెస్మీట్ లో పాల్గొన్న నామ

రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం తప్పదు : నామ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు శనివారం హైదరాబాద్ చేరుకున్న ఢిల్లీ , పంజాబ్ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్ కు కేసీఆర్ తో కలసి బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రగతి భవన్ లో జరిగిన ముఖ్యమంత్రుల ప్రెస్ మీట్ లో కూడా ఎంపీ నామ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన ప్రభుత్వాలపై కేంద్రం కుట్ర పూరితంగా వ్యవహరిస్తూ రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకుంటుందని అన్నారు. తెలంగాణా పై లేనిపోని ఆంక్షలు విధిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటుందని, రాబోయే ఎన్నికల్లో కేంద్రంలోని పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని నామ నాగేశ్వరరావు అన్నారు.

Related Posts

You cannot copy content of this page