భారత రాజ్యాంగంపై పూర్తి అవగహన.. ప్రతి పౌరునికి అవసరం…

Spread the love

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే భారత రాజ్యాంగ గ్రంధాన్ని పౌరులందరికీ ఉచితంగా పంపిణీ చేయాలి.

ధర్మ సమాజ్ పార్టీ ప్రచార కమిటీ డిమాండ్

రామగుండం : భారతదేశంలో ఉన్న పౌరులందరికీ భారత రాజ్యాంగ గ్రంధాన్ని ఉచితంగా పంపిణీ చేయాలని ధర్మ సమాజ్ పార్టీ ప్రచార కమిటీ రామగుండం మండల తహసిల్దార్ కి విజ్ఞాపన పత్రము అందజేసినారు. ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు, డి.ఎస్.పి. రాష్ట్ర అధ్యక్షులు డా. విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు భారతదేశంలో ఉన్న పౌరులందరికీ , భారత రాజ్యాంగంపై పూర్తి అవగాహన, శిక్షణ కల్పించాల్సిన అవశ్యకతలో భాగంగా, భారత రాజ్యాంగ గ్రంధాన్ని ఉచితంగా పంపిణీ చేయాలనే డిమాండ్ తో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు, మండల తహసిల్దార్ లకు విజ్ఞాపన పత్రాలు అందజేసే కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి తహసిల్దార్ జహిద్ పాషాకు వినతి పత్రం అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా డి.ఎస్.పి. జిల్లా కన్వనర్ కనకం గణేష్, జిల్లా నాయకులు కండే రవీందర్ మాట్లాడుతూ, ఈ దేశాన్ని 100% నడిపిస్తున్నది భారత రాజ్యాంగమేనని, అలాంటి గ్రంథం పట్ల నూటికి 90% ప్రజలకు అవగాహన లేకనే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం విఫలమైపోతున్నదని, దీనివల్ల 90% ప్రజల జీవితాలు అన్ని రంగాలలో అభివృద్ధి లేక అధోగతి పాలవుతున్నాయని, భారత రాజ్యాంగంపై పూర్తి అవగహన ద్వారా సామాన్య ప్రజలు అవకాశాల్లో అంతస్తుల్లో, అన్నింటిలో ముందడుగు వేసి ప్రధాన స్రవంతిలో కలవడానికి అవకాశం ఉందని, అందుకే ఈ దేశ ప్రజలందరికీ భారత రాజ్యాంగ గ్రంధంను ప్రాంతీయ భాషల్లో ఉచితంగా పంపిణీ చేయాలని, అన్ని జిల్లాల, మండలాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నామని, భారత దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి భారత రాజ్యాంగం పై పూర్తి అవగాహన ఉండాలని, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు, చట్టాలు తెలియాలని, అప్పుడే ధర్మ,అధర్మాలను బేరీజు వేస్తారని, ధర్మ సమాజ్ పార్టీ ధర్మం వైపు వెళుతుందని తెలియ చేసేందుకే భారత రాజ్యాంగ గ్రంధాన్ని ప్రతి పౌరునికి అందజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

భారత రాజ్యాంగంను కాపాడితే అది మనందరిని కాపాడుతుందని, అంతేకాకుండా రానున్న రోజులలో ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు ప్రభుత్వాలు అమలు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలపై పోరాటం చేస్తామన్నారు. చివరగా జై భీమ్.. జై భారత రాజ్యాంగం… అని నినదించారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ మండల నాయకులు రమాకాంత్ మహారాజ్, కల్లేపల్లి నరేష్ మహరాజ్, సందీప్ మహారాజ్, రాజమౌళి మహరాజ్ , పులిపాకా రవీందర్, చంద్రగిరి నర్సయ్య, చంద్రగిరి వినోద్, కసిపేట శ్రీనివాస్, కాల్వల అనిల్ మహరాజ్, కొరుకంటి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page