అయ్యప్ప సొసైటీ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన

Spread the love

సాక్షిత : మాదాపూర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన ను రంగారెడ్డి జిల్లా DMHO వెంకటేశ్వరరావు , డిప్యూటీ DMHO శ్రీమతి సృజన , డీసీ సుధాంష్ , కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్ , నార్నె శ్రీనివాసరావు , AMOH కార్తిక్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ .

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ పేద మరియు మద్య తరగతి ప్రజలకు అందుబాటులో ఈ బస్తి దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగినది అని ,ప్రతి ఒక్కరు ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోయఁగ పర్చుకోవాలిని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు .అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడానికి బస్తీ ధవాఖానాల ఏర్పాటు చేసిన విషయం విదితమే అని ప్రజలకు మెరుగైన వైద్యం కోసం ,పేద ప్రజలకు,మధ్య తరగతి ప్రజలకు ఇంటి వద్దే ఉచిత వైద్యం అందించాలనే సంకల్పం తో ముఖ్యమంత్రి కెసిఆర్ బస్తి దవాఖాన ఏర్పాటు చేయడం జరిగినది అని.బస్తి దవాఖాన ల ద్వారా పేద ప్రజలకు మంచి నాణ్యమైన ఉచిత వైద్యం అందుతుందని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. మన బస్తీలో.. ఇంటి పక్కనే వైద్యం.. అదీ ఉచితంగా.. ఇప్పటికే నగరంలోఅందుబాటులో ఉన్న బస్తీ దవాఖానలు మరింత విస్తృతం అవుతున్నాయి.. నిత్యం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీతో పాటు వైద్య పరీక్షలు చేసి మందులు అందిస్తున్నారు.ఆపత్కాలంలో ఆదుకున్న బస్తీ దవాఖానలు. ప్రభుత్వ దవాఖానాల్లో అత్యవసర, ఓపీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ రవాణా సౌకర్యం లేకపోవడంతో రోగులు ఉస్మానియా, నిలోఫర్‌ లాంటి వైద్యశాలలకు వెళ్లలేకపోయారు ఈ ఆపత్కాల సమయంలో బస్తీ దవాఖానాలే ఆదుకున్నాయి అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు. అదేవిధంగా బస్తీ దవాఖాన లో
55 రకాల వైద్య పరీక్షలు చేయబడును అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయ్యప్ప సొసైటీ కాలనీ మరియు చుట్టుపక్కల వారికి, ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని. ఈ బస్తి దవాఖానాలు ఎల్లపుడు ప్రజలకు అందుబాటులో ఉండడం వలన ప్రజలకు సరైన సమయంలో వైద్యం లభించునని ఎమ్మెల్యే పేర్కొన్నారు ,ఈ బస్తి దవాఖానాలు పేద ప్రజల ఆరోగ్యానికి ఎంతో భరోసా అని ,ప్రజలందరూ సద్వినియోగపరుచుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు . అదేవిధంగా బస్తి దవాఖానాలు ఏర్పటు కై బస్తీలలో ,ప్రజలు ఎక్కువ నివాసం ఉన్న ప్రాంతలలో సరైన భవనాలు లేని చోట ఎమ్మెల్యే గాంధీ సొంత నిధుల తో మరియు దాతల విరాళాలతో కంటైనర్ లు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ ద్వారా వైద్య సదుపాయాలు అందుబాటలోకి వస్తాయని ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్ , స్టాఫ్ నర్సు , ల్యాబ్ టెక్నీషియన్ అందుబాటులో ఉండి మెరుగైన సేవలను అందిస్తారని ప్రభుత్వ విప్ గాంధీ తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ బీఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుమ్మడి శ్రీనివాస్ ,రాంచందర్, అయ్యప్ప సొసైటీ కాలనీ ప్రేసిడెంట్ పెద్ద మధుసూదన్ రెడ్డి,సెక్రటరీ KV రావు, వైస్ ప్రెసిడెంట్ డి.వి రత్నం , చిన్న మధుసూదన్ రెడ్డి,పరమేశ్వర్, సందీప్ ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు .

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page