కరెంటు షాక్ తో మృతి చెందిన బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే చొరవతో రూ.9 లక్షల పరిహారం అందజేత…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని కళావతి నగర్ కు చెందిన జావిద్ (30) ఐడిపిఎల్ లోని ఓ మినీ ఇండస్ట్రీలో ఎలక్ట్రీషన్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా 24 జూలై 2022న ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తో మరణించాడు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రత్యేక చొరవ చూపి సదరు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడారు. మృతుడి కుటుంబానికి రూ.9 లక్షల నష్ట పరిహారం అందిచేలా యాజమాన్యాన్ని ఒప్పించారు. ఈ మేరకు చెక్కును ఎమ్మెల్యే తన నివాసం వద్ద కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధుమోహన్, మునీర్, సాజిద్, అన్ను, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
కరెంటు షాక్ తో మృతి చెందిన బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే చొరవతో రూ.9 లక్షల పరిహారం అందజేత…
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…