మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురుపై కేసు నమోదు

Spread the love

మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురుపై కేసు నమోదు: ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్


గద్వాల:-మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్‌ ఎస్‌ఐ విజయ్ భాస్కర్ అన్నారు. గద్వాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి సమీపంలోని దర్గా వద్ద సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ నిర్వహించి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న నలుగురిపై కేసులు నమోదు చేశారు.

హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌పై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ఫైన్ తో పాటు లైసెన్సులు రద్దు చేస్తామని, 6 నెలలు జైలుకు కూడా పంపుతామని అన్నారు.ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి వాహనాలు నడపాలని సూచించారు. కార్యక్రమంలో శివకుమార్, కృష్ణ వర్ధన్ నాయుడు, రమేష్, సుధాకర్, రామకృష్ణ, జహీరుద్దీన్,ఖలీమ్,గోపాల్ పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page