బాబు జగజీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా ఆయన సంక్షిప్త జీవిత చరిత్ర

Spread the love

బాబూజీ 116 వ జయంతి ఉత్సవాలలో భాగంగా
డాక్టర్బాబుజగజీవన్ రామ్ సంక్షిప్త జీవిత చరిత్ర
వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేశం మనది నేడు భారతదేశముగా పిలవబడుతున్న ఈ జంబుద్వీపంలో ఎందరో మహామహులు మహనీయులు దేశభక్తులు యోగులు, యోధులు జన్మించి భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగుర వేశారు మహోజ్వల సంస్కృతిని ప్రపంచానికి తెలియచెప్పారు అటువంటి అగ్ర గన్యుల్లో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఒకరు భారత రాజకీయ వినీలాకాశంలో వేల కాంతి లేను రమణీయ తార డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అతి సామాన్యుడుగా పుట్టి అసమ్మన్యుడుగా ఎదిగిన అగ్రగన్యుడు అనే కానేక సవాలనే ఎదుర్కొని నిలిచిన అనితరా సాధ్యుడు అలుపెరగని యోధుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ శతాబ్దాల చరిత్రలో యుద్ధం చేయడం గెలవడం తెలియని భారతదేశానికి తొలి విజయాన్ని అందించడమే కాకుండా అమెరికా యుద్ధ నౌకలకు ఎదురు నుంచి 90 వేల మంది శత్రు సేనలను బందీలుగా భారతావనికి అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బాబు జగజీవన్ రామ్

జననం – జన్మస్థలం
బీహారు రాష్ట్రంలోని షాబాద్ జిల్లా ఆరా పట్టణానికి సమీపముగానున్న చాంద్వా గ్రామములో ఏప్రిల్ ఐదున 1908 న డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జన్మించారు హైందవ కాలమానం ప్రకారం డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చైత్రమాస శుక్లపక్షాన తృతీయ నక్షత్రాన బ్రహ్మ కాలంలో తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు ఆదివారం జన్మించారు తల్లి బసంతి దేవి తండ్రి శోభిరామ్ సర్వ మానవ సమానత్వాన్ని చాటే శివ నారాయణ శాకో పాసకుడైన శోభిరామ్ బ్రిటిష్ సైనికో ఉద్యోగిగా పనిచేసి తన మత కార్యకలాపాలరీత్యా ఉద్యోగాన్ని వదిలి చాంద్వా గ్రామంలో భూమి కొని వ్యవసాయదారులుగా జీవనం కొనసాగించేవారు వీరు చమారు కులమునకు చెందినవారు శోభీరం దంపతులకు ఐదవ సంతానంగా పుట్టిన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ రెండవ మగ బిడ్డ ఒక అన్న ముగ్గురు అక్కల తర్వాత పుట్టిన ఈ భావినేతకు పండితులు పెట్టిన పేరు బుద్ధారాం అయితే శివ నారాయణ శాఖలో మహంతి స్థాయికి చేరిన సుభీరం ఆధ్యాత్మిక గురువైన సంత్ రవిదాస విరచిత అమృత్ బాణీలోని ప్రభువు జీ సంగత్ శరత్ జగజీవన్ మురారి అను పద్య పాదం నుండి జగజీవన్ అనే పదాన్ని తన కుమారుని పేరుగా నిర్ధారించగా బుద్ధారం బదులు జగజీవన్ రామ్ స్థిర నామం అయ్యింది జగ్జీవన్ ని ఆరవ ఏటే తండ్రి మరణించిన కారణంగా జగ్జీవన్ రామ్ బాల్యం పేదరికంలోనే గడిచింది

విద్యాభ్యాసం
6వ ఏటా అనగా 1914లో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ప్రాథమిక విద్య చాంద్వా పాఠశాలలో ప్రారంభమైంది మొదటి ఐదు తరగతులు చాంద్వాలో పూర్తి చేసిన తర్వాత ప్రాథమికోన్నత విద్యుత్ కొరకు 1920లో ఆరా పట్టణమండలి అగర్వాల్ మిడిల్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం లో ప్రవేశించారు బాబుజి 1922 ఆరా టౌన్ స్కూల్లో చేరగా అక్కడే జగ్జీవన్ రామ్ కు అస్పృశ్యత అనుభవంలోకి వచ్చింది. మంచి నీటి కుండల ధ్వంస చరిత్ర ఇక్కడే జరిగింది ఈ విషయం రాబోయే అంశాలలో చర్చించుకుందాం. 1925లో బాబూజీ జీవితాన్ని ప్రభావితం చేసిన సంఘట ఆరాటౌన్ స్కూల్లోనే చోటుచేసుకుంది ఈ స్కూలును సందర్శించిన పండిట్ మదన్మోహన్ మాలవ్య (బెనారస్ హిందూయూనివర్సిటీవ్యవస్థాపకులు) బాల జగజీవని స్వాగతంన్యాసానికి మద్దుడై పై చదువులకు బెనారస్ హిందూ యూనివర్సిటీకి ఆహ్వానించారు మెట్రిక్యులేషన్ ప్రథమ శ్రేణులు ఉత్తీర్ణుడైన జగ్జీవన్ 1927లో తన ఐఎఫ్సి చదువు కోసం కాశీలో ప్రవేశించి బిర్లా మెరిట్ ఉపకార వేతనాన్ని పొంది తన ఇంటర్మీడియట్ ఇన్ సైన్స్ కోర్సును పూర్తి చేశాడు ఈ సమయములోనే బాబుజి సమాజం పట్ల దేశ పరిస్థితుల పట్ల నిర్దిష్ట భావాజాలాన్ని ఏర్పరచుకున్నాడు 2007లో బెనారస్ హిందూ యూనివర్సిటీ వారు సామాజిక వివక్ష ఆర్థిక విసుకుబాటుతనాలపై పరిశోధనలు ప్రోత్సహించు నిమిత్తం బాబూజీ పేరున విద్యాపీఠాన్ని నెలకొల్పారు 1931లో కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి బిఎస్సి పట్టా పొందారు బాబూజీ

వైవాహిక జీవితం కుటుంబం

నాటి ఆచార వ్యవహారాల ప్రకారం బాబూజీ కి సోనాపూర్ గ్రామానికి చెందిన శ్రీముఖి లాల్ గారి కుమార్తెతో ఎనిమిదవ యేటినే వివాహం జరిగింది. (భార్య పేరు అలభ్యం) 17 సంవత్సరాల దాంపత్యం తర్వాత ఆమె అకాల మరణం చెందగా కాన్పూర్ పట్టణ ప్రముఖులు చమార్కులస్తులైన డాక్టర్ బీర్బల్ గారి కుమార్తె ఇంద్రాణి దేవితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం కుమారుడు సురేష్ రామ్ కుమార్తె మీరా కుమార్

సాంఘికోద్యమాల నేపథ్యం

ఆత్మగౌరవం భంగపడితే ఎదురు తిరిగే గుండె ధైర్యం చెమరుల చైతన్యం జగజీవన్ రామ్కు జన్మతః వచ్చాయనిటంలో సందేహం లేదు దానికి తార్కానమే
ఆరా స్కూలు మంచినీటి కుండా ఆరాస్తులను విద్యార్థులు త్రాగేందుకు రెండు మంచినీటి కుండలు ఉండేవి ఒకటి హిందువులకు మరొకటి ముస్లింలకు హిందువులకుండ మీరే బాబుజి త్రాగితే అంటరాని వాడు త్రాగిన నీరని అగ్రవర్ణ విద్యార్థులు చేసిన గొడవ కారణంగా స్కూలు వారు అంటరాని వారి కొరకు మరో కుండ ఏర్పాటు చేశారు మొదటిసారిగా అంటరానితనాన్ని కుల వివక్షను కల్లారా చూసిన బాల బాబూజీ గుండె గంతలయ్యింది అయితే బాధపడుతూ కూర్చోక పెట్టిన ప్రతిసారి మూడవ కుండను పగలగొట్టి అంటరాని వారు ఎలా వేరయ్యారని నిలదీశాడు చివరకు యాజమాన్యానికి మూడవకుండా విరమించుకోవలసి వచ్చింది. సొంత పొలము నుండి ధాన్యము తీసుకురావడానికి కోపిరా గ్రామానికి ఎద్దుల బండి పై వెళ్లారు బాల బాబూజీ ఆ గ్రామంలో ఠాకూర్ గారెలు సమీపించేసరికి బండి దిగమని చెప్పాడు బండి నడుపుతున్న రైతు ఎందుకంటే ఆ రోజుల్లో నిమ్మన జాతీయులు గ్రామవీధుల్లో వెళ్లడమే తప్పు బండిమీద వెళ్లడం అంటే మరింత తప్పు కానీ ఆత్మగౌరవాన్ని అమితంగా ప్రేమించే బాబూజీ బండి దిగేది లేదని కరాకండిగా చెప్పి వీధిలో దర్జాగా వెళ్లడాన్ని చూసిన గ్రామస్తులు బండి దిగాలన్న నియమాన్ని ఉపసంహరించుకున్నారు
కాశీ విశ్వవిద్యాలయం లో చదువుకునే కాలంలో వివక్షను చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది. విద్యార్థులు అందరితో కలిసి హాస్టల్లో భోజనము చేయడానికి సహ విద్యార్థులు అభ్యంతరం పెడితే అంటరాని వాడికి వడ్డించడానికి సిబ్బంది నిరాకరించేవారు క్షురకులు జుట్టు కత్తిరించే వారు కాదు ఇటువంటి అసమానతలకు వ్యతిరేకంగా విద్యార్థి దశలోనే గల మెత్తారూ బాబూజీ కాశీలోని అంటరాని కులాలను సమీకరించి ఆనాడే తిరుగుబాటు చేశారు బాబుజి కాశీలోని దుకాణాలన్నిటిని బందు చేయించగలిగారు అప్పటికే దేశంలో అనేక చోట్ల సాంఘిక దురాచారాల పైన వ్యతిరేక ఉద్యమాలు రూపుదిద్దుకుంటున్నాయి మహాత్మా జ్యోతిరావు పూలే మాత సావిత్రిబాయి పూలే ఛత్రపతి సాహుజి మహారాజ్ నారాయణ సగురు రామస్వామి నాయకర్ల సారథ్యంలో కుల వివక్షకు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి జరుగుతున్నవి కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకున్నారు బాబుజీ ఆ కారణంగానే కాశీలో ఉద్యమం సాధ్యమైనదిగా తెలుస్తుంది కలకత్తా విశ్వవిద్యాలయంలో చదువుతున్న రోజుల్లో కూడా సంత రవిదాస సభను ఏర్పాటు చేసి కుల వివక్షతకు వ్యతిరేకంగా అనేక సమావేశాలు నిర్వహించడమే కాక గాంధీ గారు మొదలుపెట్టిన అంటరాని తన వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాలుపంచుకున్నారు పాతికేళ్ల బాబూజీ కేవలం కుల సంఘాల సమావేశంలో కాదు 1928లో వేలాది మందితో కలకత్తా వెళ్ళిన్థం స్క్వేర్ లో నిర్వహించిన మజ్దూర్ సభ నేతాజీని దృష్టిని కూడా ఆకర్షించిందని చరిత్రకారులు చెబుతారు 1929లో అంటరాని వారి సభను ఏర్పాటు చేస్తే ఆ సభకు అధిక సంఖ్యలో అంటే సంపూర్ణ స్వరాజ్ పిలుపునిచ్చిన కాంగ్రెస్ సభకు మించి ప్రజలు హాజరయ్యారు ఈ సభ ద్వారా గాంధీజీ మిక్కిలి ఆకర్షించబడ్డాడు జనవరి 15 1934 న బీహార్ నేపాల్ లో సంభవించిన పెను భూకంపం అనేక మందిని పొట్టన పెట్టుకుంది లక్షలాదిమంది నిరాశ్రయుల ఆ సమయంలో అక్కడికి చేరుకుని బాధితులకు బాబూజీ అందించిన సేవలను సహకారాన్ని మొత్తం దేశమంతా గుర్తించింది అక్టోబర్ 19 1935న హేమంత్ కమిటీ ముందు మొట్టమొదటిసారిగా అంటరాని వారికి ఓటు హక్కు నివ్వాలని నిలదించారు బాబుజి

రవ్వదాసియ మతాళంబి

సంత్ రవిదాస్ బాబుజీ యొక్క ఆధ్యాత్మిక గురువుదాసు గారు చమార్కులానికి చెందిన గొప్ప మత గురువు 150 సంవత్సరాలు జీవించి సమాజంలోని అసమానతలను వివక్షతలను రూపుమాపడానికి ఆధ్యాత్మిక మార్గం ఎంచుకున్న సంస్కర్త దేవుడు ఒక్కడే అని సృష్టి మొత్తం దేవుని శరీరమేనని బోధించి ఎందరో సనాతన వాదులను మార్చిన మహానుభావుడు సంతర్ అవిదాస్ ఎక్కడైతే ఏ అంతరాలు లేకుండా సర్వమానవాళి సుఖమయ జీవనం సాగిస్తుందో ఆ రాజ్యమే నా అభిమతం అన్న రవిదాసు విధానాన్ని తన జీవితాంతం బాబూజీ కొనసాగించారు ప్రతిఏటా నియమం తప్పక రవిదాస జయంతి ఉత్సవాలు జరిపేవారు

రాజకీయ జీవితం

1932లో తన 24 వేట బాబుజీ రాజకీయ రంగ ప్రవేశం చేశారు హరిజన ముక్తి సంఘం ద్వారా హరిజనుల స్వాతంత్రానికి పోరాటం చేశారు ఆ సంవత్సరంలోనే ఆరా పట్టణ మున్సిపల్ బోర్డు మెంబర్ గా ఎన్నికయ్యారు 1935లో ఇండియన్ డిప్రెసెడ్ క్లాస్ లీగ్ స్థాపించి నిమిషతీయుల హక్కుల కోసం పోరాటం ప్రారంభించారు అదే సంవత్సరములు వచ్చిన పాపులర్ రూల్ ద్వారా అంటరాని వారికి చట్టసభలలో ప్రాతినిధ్యం కల్పించబడింది జాతీయవాదులు బ్రిటిష్ విధేయులు కూడా బీహారు సమస్యలపై సమగ్ర అవగాహన కలిగిన బాబూజీని తమ తరఫున బీహార్ విధాన పరిషత్ కు ఆహ్వానించారు నరనరాలలో దేశభక్తి నింపుకున్న బాబూజీ జాతీయ వాదుల తరఫున కౌన్సిల్లో అడుగుపెట్టారు ఆ విధంగా భారత జాతీయ కాంగ్రెస్లో భాగస్వామిగా మారారు ఈ సంవత్సరమే జరిగిన హిందూ మహాసభలో దళితులకు దేవాలయం ప్రవేశం కల్పించాలని బావులు చెరువుల్లో మంచినీరు త్రాగే హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు 1937లో ఇండియన్ డిప్రెసెడ్ క్లాస్ లీగ్ తరపున పోటీ చేసి బీహార్ శాసనసభకు ఎన్నుకోబడ్డారు మొత్తం 15 సీట్లలో పోటీ చేసిన ఇండియన్ డిప్రెసెడ్ క్లాస్ లీగ్ 14 సీట్లలో ఏకగ్రీవంగాను ఒక సీట్లు అత్యధిక మెజార్టీతో గెలవడం నిజంగా ఒక చరిత్ర ఒక అంటరాని చమారు పార్టీ పెట్టడం తన పార్టీ తరఫున అభ్యర్థులను గెలిపించి చట్టసభలకు పంపడం ఒక్క బాబు జీకే చెల్లింది నిజంగా ఇది అనితర సాధ్యం ఆనాటి యూనిస్ ప్రభుత్వం విధించిన నీటిపారుదల సంఘానికి వ్యతిరేకంగా తన పదవిని తృణప్రాయంగా ఎంచి రాజీనామా సమర్పించారు

జైలు జీవితం

సత్యాగ్రహ విత్ ఇండియా ఉద్యమాలలో పాల్గొన్నందుకు మరియు ఐరోపాధ్యాయుల మధ్య జరుగుతున్న రెండో ప్రపంచ యుద్ధంలో భారతదేశం పాలుపంచుకోవడానికి వ్యతిరేకించిన కారణంగాను 1940 దర్శకములో రెండుసార్లు బాబూజీ కి జైలు శిక్ష పడింది డిసెంబర్ 10 1940 నుండి సెప్టెంబర్ 10 1941 వరకు మొదటిసారి మరియు ఆగస్టు 22 1942 నుండి అక్టోబర్ ఐదు 1943 వరకు రెండవసారి బాబూజీ జైలు శిక్షను అనుభవించారు కానీ ఏ శిక్షలు ఆయన అకుంఠిత దీక్షను ఆపలేకపోయాయి

పార్లమెంటరీ జీవితం

1946లో జవహర్లాల్ నెహ్రూ గారి సారథ్యంలో ఏర్పడిన మద్యంతర ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో బాబూజీ పార్లమెంటు లోనికి అడుగుపెట్టారు అక్కడినుండి తన మరణం వరకు పార్లమెంటు మెంబర్గా వివిధ పదవులలో సేవలు అందించారు ఈ సమయములోనే చిన్న వయసులోనే మంత్రి అయిన కారణాన బాబూజీ బేబి మంత్రిగా పేరు సంపాదించుకున్నారు 1947లో స్వతంత్ర భారత తొలి కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు 1952 వరకు అదే శాఖలో కొనసాగారు ఆ కాలంలో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కు అధ్యక్షులుగా కూడా ఎన్నుకోబడ్డారు వివిధ విషయాలను చర్చించి రాజ్యాంగంలో పొందుపరిచే నిమిత్తం ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగ కమిటీకి ఉపఅధ్యక్షులుగా డ్రాఫ్టింగ్ కమిటీ ప్రతిపాదించిన అనేక హక్కులకు కమిటీని ఒప్పించి చట్టబద్ధత చేసిన ఘనత బాబుజీ కే దక్కుతుంది

బాబూజీ చేపట్టిన వివిధ మంత్రిత్వ శాఖలు

1) కార్మిక శాఖ 1947 నుండి 1952 వరకు నెహ్రూ కేబినెట్లో
2) సమాచార శాఖ 1952 నుండి 1956 వరకు నెహ్రూ క్యాబినెట్
3) రవాణా మరియు రైల్వే శాఖ 1956 నుండి 1962 వరకు నెహ్రూ క్యాబినెట్
4) రవాణా మరియు సమాచార శాఖ 1962 నుంచి 1963 వరకు నెహ్రూ క్యాబినెట్
5) కార్మిక ఉపాధి పునరావాస శాఖ 1966 -67 ఇందిరాగాంధీ క్యాబినెట్
6) ఆహార మరియు వ్యవసాయ శాఖ 1967 నుండి 1970 ఇందిరాగాంధీ క్యాబినెట్
7) రక్షణ శాఖ 1970 నుండి 1974 వరకు ఇందిరాగాంధీ క్యాబినెట్
8) వ్యవసాయ మరియు నీటిపారుదల శాఖ 1974 నుండి 1977 వరకు ఇందిరాగాంధీ క్యాబినెట్
9) ఉప ప్రధాని మరియు రక్షణ శాఖ 1977 నుండి 79 వరకు మొరార్జీ దేశాయ్ క్యాబినెట్
23 1977 నుండి ఆగస్టు 22 1979 వరకు ఉప ప్రధానీ పదవిని అలంకరించారు బాబూజీ మొరార్జీ దేశాయ్ రాజీనామా తర్వాత అత్యధికంగా పార్లమెంటు సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ బాబుజీకి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వలేదు ఆనాటి దేశాధ్యక్షులు కుల వివక్షే దీనికి కారణమని ఆనాటి పత్రికలు ఎలుగెత్తి చాటాయి 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ప్రధాని అభ్యర్థిగా జనతా పార్టీ ప్రకటించింది ఆ తర్వాత ఆగస్టు 5 1981న కాంగ్రెస్ జే స్థాపించారు

సాధించిన విజయాలు

78 సంవత్సరాల జీవన ప్రయాణములు 1936 నుండి 1986 వరకు అంటే 50 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా అందులో 40 సంవత్సరాలు పార్లమెంటు మెంబర్గా 30 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా సేవలందించారు బాబుజి ఇది ఒక ప్రపంచ రికార్డు

ఒక దళితుడు సొంత జెండాపై ద్రిపెస్డ్ క్లాసు లీగ్ పోటీ చేసి బీహార్ అసెంబ్లీకు తన సైన్యాన్ని నడిపించిన ఘనత బాబుజీకే దక్కుతుంది అదేవిధంగా కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీని స్థాపించి 28 మందిని వెంటబెట్టుకుని పార్లమెంటుకు వెళ్లిన ఘనత కూడా బాబూజీ కే దక్కుతుంది అలాగే 1984లో మరల సొంత పార్టీ కాంగ్రెస్ ద్వారా పార్లమెంటుకు ప్రవేశించాడు బాబుజి తన రాజకీయ జీవితం మొత్తంలో ఓటమి ఎరుగని యోధుడు బాబుజి ఒకే పార్లమెంటు నియోజకవర్గం ససారం నుండి గెలిచిన ఏకైక రాజకీయ దురంధరుడు బాబూజీ
నేడు కార్మికులు అనుభవిస్తున్న అనేక హక్కులు నాడు కార్మిక శాఖ మంత్రిగా బాబూజీ పార్లమెంటులో బిల్లును ప్రతిపాదించి ఆమోదం చేయించినవే ఈ సందర్భంగా గట్టి వ్యతిరేకతనే పార్లమెంటులో ఎదుర్కొన్నారు బాబూజీ కారణం ఈ బిల్లులు కాంగ్రెస్కు మూల స్తంభాలైన పెట్టుబడిదారులకు వ్యతిరేకం ఆనాటి పార్లమెంటు వ్యవహారాల మంత్రి వల్లభాయ్ పటేల్ గారు రిజర్వేషన్లతో సహా బాబూజీ ప్రతిపాదించిన అనేక బిల్లులను మొదట వ్యతిరేకించిన తర్వాత బాబూజీ వాదనతో ఏకీభవించి పార్లమెంటులో ఆ బిల్లును ఆమోదించబడ్డాయి అంటే అది కేవలం బాబూజీ చతు రతేనన్న విషయం ఈనాటి సమాజం గ్రహించాలి గుర్తించాలి
తంత్ర భారత పప్రధమ కార్మిక శాఖ మంత్రిగా బాబూజీ కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టి పార్లమెంటు చేత ఒప్పించిన బిల్లులు 1)ఇండస్ట్రియల్ ఎంప్లాయిమెంట్ యాక్ట్ 1946
2) మికా మినస్ లేబర్ వెల్ఫేర్ ఫౌండ్ 1947
3) ద ఇండస్ట్రియల్ డిస్ప్యూటీస్ యాక్ట్ 1947
4) డాక్ వర్కర్స్ ఆక్ట్ 1948
5) ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948
6) ద మినిమం వెజస్ 1946
7) ఎంప్లాయిస్ బోనస్ యాక్ట్ 1948
8) ఎంప్లాయిస్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1948
9) ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ 1948
10) ఎంప్లాయిస్ స్టేట్ ప్రెసిడెంట్ 1952
1967 నుండి 70 లలో ఆహార శాఖ మాత్యులుగా సేవలందించిన బాబుజీ నాడు కరువు కాటకాలతో కుమిలిపోతున్న దేశాన్ని తన బహుముఖ ప్రజ్ఞతో వ్యవసాయదారులకు శాస్త్రజ్ఞులకు వారధిగా నిలిచి మెరుగైన సాంకేతిక విజ్ఞానంతో వ్యవసాయ ఉత్పత్తులు పెంచి మొట్టమొదటిసారిగా దేశాన్ని స్వయం సమృద్ధి దేశంగా తీర్చిదిద్దారు భారత దేశ ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేశారు దీనినే గ్రీన్ రెవల్యూషన్ గా ప్రపంచం కొనియాడింది ఈ కారణంగా నాటి ప్రభుత్వం పోస్టల్ షాంపూ స్టాంపు విడుదల చేసి కృతజ్ఞతలు తెలుపుతుంది అంతేకాకుండా ఈ ఘన విజయం చరిత్రలో నిలిచిపోయే విధంగా నాలుగు రెండు 1967న విక్రయ యూనివర్సిటీ ఉజ్జయిని వారు బాబుజీని గౌరవ డాక్టరేట్ నుంచి గౌరవించారు గ్రీకులు గజనీలు గోరీలు, కుషానులు హునులు మంగోలులు మొగలాయిలు ఎందరో మన దేశం మీద దాడి చేసి రాజ్యాలు సామ్రాజ్యాలు స్థాపించిన చరిత్ర మనం చదువుకున్నాం స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారి విదేశంపై విజయం సాధించిన మేటి మొనగాడు ఆనాటి రక్షణ మంత్రి డాక్టర్ బాబుజీ మాత్రమే ప్రతి భారతీయుడు గర్వించే విషయం ఇది

గౌరవ డాక్టరేట్లు

బాబుజి సాధించిన విజయాలకు మెచ్చి నాలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు బహూకరించాయి ఇంతకుముందు తెలిపినట్లు ఉజ్జయినిలోని విక్రమ్ యూనివర్సిటీతో పాటు కాన్పూర్ యూనివర్సిటీ ఫిబ్రవరి 16 1972న ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం సెప్టెంబర్ 29 1973న మరియు బరంపురం యూనివర్సిటీ ఏప్రిల్ 15 1974 న బాబూజీ కి గౌరవ డాక్టరేట్లు ప్రధానం చేశాయి

రచయితగా బాబుజి

రాజనీతిజ్ఞుడుగా పేరుంది నా బాబూజీ రమారమి పది గ్రంథాలను రచించారు దురదృష్టవశాత్తు ప్రతులు అందుబాటులో లేవు కానీ కాస్ట్ చాలెంజ్ ఇన్ ఇండియా అనే గ్రంథం లభిస్తుంది. ఈ గ్రంథంలో మన దేశంలోని కుల వ్యవస్థ రూపురేఖలు దాని అనర్ధాలను ఆ మూలాగ్రం విశ్లేషించడంతోపాటు కుల నిర్మూలన మార్గాలను కూడా ప్రతిపాదించారు బాబుజీ

ఆంధ్రులతో అనుబంధం

స్వాతంత్ర సమరయోధుడిగా హరిజనోద్ధారకుడిగా జాతీయ నాయకుడిగా ఎదిగిన బాబూజీ తెలుగు ప్రజల యెడల ఎంతో అభిమానం చూపించేవారు ఎంతోమంది తెలుగువారికి రాజకీయంగా జన్మనిచ్చారు ఆ మాటకొస్తే శ్రీమతి ఇందిరా గాంధీకి
జన్మనిచ్చింది నెహ్రూ అయితే ప్రధానిగా జన్మనిచ్చింది బాబుజి బాబుజీ అని మొదటిగా పిలిచింది ఇందిరమ్మే కులాలకతీతంగా సీనియర్ రాజకీయ నాయకులు ఎందరికో ఆరాధ్యుడుగా నిలిచారు ఎస్సీలు మాల మాదిగల ఇద్దరు తమ పిల్లలకు ఆయన పేరు పెట్టుకున్నారంటే బాబుజీ పై ఆంధ్రలకు ఉన్న అభిమానం తెలుస్తుంది 1965 లో జరిగిన కంచికచర్ల సంఘటన తెలుగువారి పట్ల బాబూజీకున్న ప్రేమాభిమానాలు తెలిపే సంఘటన ఒకటి ఇక్కడ ఉదాహరించడం సందర్భోచితంగా ఉంటుంది కృష్ణాజిల్లా ఆలనాటి నందిగామ తాలూకా నేటి మండల కేంద్రంగా ఉన్న కంచికచర్ల గ్రామంలో ఆరుగట్ల కోటీసు కంచికచర్ల కోటేసు అనే మాదిగ యువకుడ్ని భూస్వామ్య యజమానులు ఇత్తడి చెంబు దొంగలించాడనే నేరము అసలు కారణమేది కాదు సజీవ దహనం చేశారు ఈ సంఘటన పార్లమెంటులో ప్రస్తావించబడింది వివరాలు తెలుసుకున్న బాబూజీ బయలుదేరి హుటాహుటిన బయలుదేరి వచ్చారు కుటుంబాన్ని పరామర్శించి దోషులపై చర్యలు తీసుకునే విధంగా అధికారులకు ఆదేశించారు కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావలసిన పరిహారం అందేలా చ ర్యలు గైకొన్నారు అందరితోనూ పరిచయ బాంధవ్యాలు ఉండేవి రాష్ట్రంలో మాజీ మంత్రివర్యులు శ్రీ తానేటి వీరరాఘవులు గారు కాంగ్రెస్ నాయకులు శ్రీ మల్లెపూడి రాజేశ్వరరావు గారు లాంటి వారే కాక తర్వాతి నా కాలములో నాయకులు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ అప్పకట్ల జోసెఫ్ గారు నాయకులు శ్రీ మేకల సుబ్బారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీ కోనేరు రంగారావు గారు లాంటి వారెందరో బాబుజితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవారు
బాబుజి విజయవాడకు వచ్చినప్పుడు మాజీ రాజ్యసభ సభ్యులు శాసన మండల సభ్యులు ఆయన అప్పగట్ల జ్యుస్ గారి ఇంటిని తప్పకుండా సందర్శించే వారిని కంచికచర్ల విషయంలో బాబూజీ కి చేదోడు వాదోడుగా అప్పికట్ల వారు ఉన్నారని అక్కడివారు చెబుతున్నారు మనం చర్చించుకోవాల్సిన విషయం మరో ముఖ్య విషయం ఏంటంటే తెనాలికి చెందిన శ్రీ పమిడిపాడు రాజారావు గారిని రైల్వే ఉద్యోగి బాబూజీ రైల్వే మంత్రిగా ఉన్న కాలంలో ఏర్పడిన పరిచయం బాబుగా పెరిగి సొంత మనిషి స్థాయికి చేరిందని రాజారావు గారి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. భారత దేశంలో మొదటిసారిగా బాబుజీ బ్రతికుండగానే విగ్రహాన్ని తెనాలిలో శ్రీ పమిడి పాదరాజరావు గారి ఆరోగ్యంలో ఆవిష్కరించడం జరిగింది. 1974లో జరిగిన ఈ కార్యక్రమానికి అప్పటి మంత్రులు శ్రీమతి లక్ష్మీదేవమ్మా శ్రీ బత్తిన సుబ్బారావు మరియు కాంగ్రెస్ నాయకులు శ్రీ శ్రీ రాజ నరసింహాహాజరయ్యారు ఈనాడు గ్రామ గ్రామాన ఆయన విగ్రహాలు ప్రతిష్టించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆంధ్రులు మరియు ముఖ్యంగా మాదిగలు ఆయన ఎడల తమకు గల గౌరవాన్ని చాటుకుంటున్నారు

ముగింపు

వ్యక్తిగత రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎత్తు ఫలాలను చావు చూసిన బాబూజీ అంతిమంగా జులై 6 1986న తుది శ్వాస విడిచి భౌతికంగా దూరమయ్యారు కానీ కోట్లాదిమంది అభిమానుల హృదయాలలో నిత్య యవ్వనంగా జీవిస్తున్నారు ఢిల్లీలో బాబూజీకి అంతిమ సంస్కరాలు జరిగిన ప్రాంతాన్ని నేడు సమతా స్థల్ అను పేర బాబుజీ మెమోరియల్ గా తీర్చిదిద్దారు బాబుజీ జన్మదినాన్ని భారత ప్రభుత్వం సమతా దివస్ గా ప్రకటించింది బాబుజీ సిద్ధాంతాల ప్రచురార్ధం మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వారు బాబు జగజీవన్ రామ్ నేషనల్ ఫౌండేషన్ స్థాపించారు కానీ నేటికీ బాబుజీకి భారతరత్న బహుకరించకపోవడం ఆయన అనుచరులు అభిమానుల గుండెల్లో బాధను మిగిల్చింది
బయటి ప్రపంచానికి తెలియని బాబూజీ చేసిన సేవలు అన్నిటిను వారి సతీమణి (మైల్ స్టోన్స్ ఏ మెమో ఇయర్ )అనే పుస్తకంలో పొందుపరిచారు మరిన్ని వివరాలుకా పుస్తకాన్ని చదవాలని మనవి
జై జీవన్ జై భారత్
జయహో జాంభవా

బాబు జగజీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా ఆయన సంక్షిప్త జీవిత చరిత్ర

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page