ఏఐటీయూసీ మేడ్చల్ జిల్లా ఏఐటీయూసీ కార్మిక నాయకుల 28,29 రెండు రోజుల పాటు జరిగే రాజకీయ శిక్షణ తరగతులను నేడు షాపూర్ నగర్ పొట్లూరి నాగేశ్వరరావు భవన్ లో పాల్గొని ఎమ్. డి.యూసుఫ్ ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు సూచనల ప్రకారం నడుస్తూ అన్ని ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ పరం చేస్తూ ప్రజల పైన ఆర్థిక భారం మోపుతున్నారని దానిలో భాగంగానే నేడు ప్రజలపై ఆర్థిక భారం పెరిగి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇలా ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తుంటే మరోపక్క పెట్టుబడిదారులు కార్మికులను దోపిడీ చేస్తూ పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా పెట్టుబడిదారులు లాభం పొందుతూ ప్రజలు మాత్రం నష్టపోతున్నారని అన్నారు.
నేటి వ్యవస్థలో ఉన్న ప్రభుత్వాలు కూడా పెట్టుబడిదారులకు సహకరిస్తున్నాయే కానీ కార్మికులకు మాత్రం గతంలో ఉన్న కార్మిక చట్టాలను తీసివేసి కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని అన్నారు. కార్మికులు,ప్రజలు తమపై జరుగుతున్న దోపిడీని ఆలోచించకుండా చెయ్యడానికి నేటి రాజకీయ పార్టీలు మతం,కులం,ప్రాంతం పేరుతో రాజకీయాలు చేస్తున్నాయి కానీ ప్రజల అవసరాలైన విద్య,వైద్యం,ఉద్యోగ భద్రత గురించి మాట్లాడట్లేదని కావున ఏఐటీయూసీ గా , కమ్యూనిస్టులగా సమాజ పరిణామాలను తెలుసుకొని ప్రజలకు నిజం చెప్పాల్సిన బాధ్యత ఉందని దానికోసం రాజకీయ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని అన్నారు. కార్మికులు కూడా రాజకీయ అవగాహన పొంది రాజకీయాల్లో పాల్గొని తమ హక్కుల రక్షణ కోసం పాటుపడాలని అన్నారు.
ఆర్థిక పరిణామాలు-కోల్పోతున్న కార్మిక హక్కుల పై ప్రముఖ శాస్త్రవేత్త డా. సోమసుందర్,
సమాజ పరిణామం పైన ఏఐటీయూసీ కార్యదర్శి బాలరాజ్ బోధించడం జరిగింది.
ఈ శిక్షణ తరగతులకు ఉమా మహేష్ సమన్వయ చెయ్యగా శిక్షణ తరగతులకు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రవిచందర్, జిల్లా అధ్యక్షుడు స్వామి,సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటరెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి మహేందర్, మునిసిపల్ అధ్యక్షుడు రాములు,డి ఎన్ షేకర్, వివిధ ప్రాంతాల కార్మిక నాయకులు పాల్గొన్నారు.