SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 18 at 3.19.53 PM

నిజామాబాద్ జిల్లా: వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులను ఎమ్మెల్సీ కవిత కోరారు. నిజామాబాద్‌ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో పాటు మున్సిపల్‌ కమిషనర్‌తో ఎమ్మెల్సీ కవిత ఫోన్‌లో మాట్లాడి పలు సూచనలు చేశారు.

నిజామాబాద్‌ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో పాటు మున్సిపల్‌ కమిషనర్‌తో ఎమ్మెల్సీ కవిత ఫోన్‌లో మాట్లాడి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా డెంగీ వ్యాధి ప్రబలకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

ఎప్పటికప్పుడు దోమల నివారణ మందులు పిచికారీ చేస్తూ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. డెంగీ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సీజనల్‌ వ్యాధుల నివారణ మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించవద్దని కోరారు…!!


SAKSHITHA NEWS