SAKSHITHA NEWS

శ్రీ కృష్ణుడు ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనకాపల్లి ఎం.పీ.రమేష్ – ఎమ్మెల్యే పంచకర్ల

సాక్షిత:- అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆసకపల్లె గ్రామ శివారు ఎర్రవాని పాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణుని ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాఅనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీ.ఎం రమేష్ గారు జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారితో కలసి పాల్గొన్నారు.గ్రామానికి విచ్చేసిన నాయకులుకు ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికారు.ముందుగా గ్రామం లో పలు అభివృద్ధి కార్యక్రమలకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. శ్రీకృష్ణుడి విగ్రహ ప్రతిష్టాపన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్థానిక కూటమి నాయకులు మరియు గ్రామ కమిటీ సభ్యులు దుశ్శలువతో సత్కరించి మోమేంటోను అందజేశారు.కార్యక్రమం లో ఉమ్మడి విశాఖ జిల్లా కూటమి నాయకులు మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS