SAKSHITHA NEWS

సాక్షిత – సిద్దిపేట బ్యూరో చీఫ్ :
బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ తహశీల్దార్ కార్యాలయం ముందు గురువారం స్థానిక బిజెపి నాయకులు ధర్నా నిర్వహించారు. బిజెపి హుస్నాబాద్ పట్టణ మండల అధ్యక్షులు బత్తుల శంకర్ బాబు చెక్కబండి విద్యాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాజీ హౌస్ ఫేడ్ చైర్మన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మ శ్రీరాం చక్రవర్తి హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలైన వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తానని, దళితులకు దళిత బంధు గిరిజనులకు గిరిజన బంధు బీసీలకు బీసీ బంధు హామీలను ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేయడం సిగ్గు చేటైన విషయమన్నారు.

వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కోశాధికారి, కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, బీజేవైయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని సతీష్, జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి కందుకూరి సతీష్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బొనగిరి రవి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మగాని రవీందర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శులు భూక్యా సంపత్ నాయక్, బొల్లి శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షులు బోగా మహేష్కర్, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు పోలోజు రాజేందర్, బీజేవైయం పట్టణ అధ్యక్షుడు బొప్పిశెట్టి భీమేశ్వర్, ఓబీసీ మోర్చా పట్టణ ఉపాధ్యక్షులు బోడిగే వెంకటేష్, అధికార ప్రతినిధి అశాడపు శ్రీనివాస్, కార్యదర్శి అబ్బిడి లింగారెడ్డి, ఎస్టీ మండల ప్రధాన కార్యదర్శి లావుడ్య రైనా నాయక్, బూత్ అధ్యక్షులు బొప్పిశెట్టి సాయికుమార్, పెందోట భూశంకర్ చారీ, బీజేపీ నాయకులు కోమటి సత్యనారాయణ, వెల్దండి రాజేందర్ ప్రసాద్, నారోజు నరేష్, న్యాలం సందీప్, ఎర్రోజు సాయి కృష్ణ, ఎర్రబెల్లి ప్రశాంత్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS