SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 08 at 2.31.22 PM

తాడేపల్లి మహానాడు, సీతానగరం ప్రాంతాలలో గత కొద్ది కాలంగా నిర్మాణం జరుగుతున్న సిసి డ్రైన్లు, సిసి రోడ్ల నిర్మాణ పనులను కార్పొరేషన్ అధికారులతో, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది.

తాడేపల్లి మహానాడు ప్రాంతంలో సిసి రోడ్లు డ్రైన్లు మొత్తం కలిపి సుమారు 2 కోట్ల 80 లక్షల రూపాయలతో నిర్మాణం చేస్తుండగా, సీతానగరం ప్రాంతంలో సుమారు 1 కోటి 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మాణ పనులు జరుగుచున్నవి.

తాడేపల్లి సీతానగరం మహానాడు ప్రాంతాలకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు సుమారు 4 కోట్ల రూపాయలతో జరుగుచున్నవి.

ఇంకా ఈ ప్రాంతంలో అవసరమైనటువంటి సీసీ రోడ్లను, డ్రైన్లను నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయవలసిందిగా ఎమ్మెల్యే ఆర్కే కార్పొరేషన్ అధికారులకు సూచనలు చేశారు.


SAKSHITHA NEWS