SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 01 at 6.45.38 PM

మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు మెట్రో కారిడార్ విస్తరణ చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న శుభసందర్భంగా బాణా సంచా కాల్చి, స్వీట్లు పంచి ,ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్ సమావేశంలో మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు మెట్రో కారిడార్ విస్తరణ చేపట్టాలని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న శుభసందర్భంగా మంత్రి ,బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మెరకు మియాపూర్ మెట్రో స్టేషన్ లో కార్పొరేటర్లు హమీద్ పటేల్ జగదీశ్వర్ గౌడ్ , నార్నె శ్రీనివాసరావు , ఉప్పలపాటి శ్రీకాంత్ , మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు గారు మరియు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేసి,స్వీట్లు పంచి ,బాణాసంచా కాల్చి , హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ హైదరాబాద్‌ మెట్రోను భారీగా విస్తరించాలని తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం.. రూ.60 వేల కోట్లతో హైదరాబాద్ నలువైపులా మెట్రో విస్తరణ చేపట్టడం చాలా సంతోషకరమైన విషయం అని,దానిలో భాగంగా మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు 13 KM మేర 3,250 కోట్ల రూపాయల తో మెట్రో విస్తరణచేపట్టడం చాలా శుభపరిణామం అని, మియాపూర్ నుండి లక్ది కపుల్ వరకు విస్తరణ చేపట్టడం గొప్ప విషయం అని ,మెరుగైన జీవన ప్రమాణాల కోసం, ట్రాఫిక్ రహిత సమాజం కోసం, ప్రజా సౌకర్యార్థం మియాపూర్ చౌరస్తా నుండి BHEL చౌరస్తా వరకు పూణే నమూనా ప్రకారం మెట్రో మార్గం మరియు ఫ్లై ఓవర్ ను ఒకే పిల్లర్ మీదుగా వచ్చే విధంగా నూతనంగా నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గతంలో శాసన సభ సమావేశాలలో నేను మాట్లాడిన సంగతి విదితమే నని ,పలుమార్లు సీఎం కేసీఆర్ దృష్టికి,

మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగినది అని,నేడు సీఎం కేసీఆర్ గొప్ప చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, ముఖ్యమంత్రి కేసీఆర్

మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.మియాపూర్ నుండి BHEL వరకు మెట్రో విస్తరణ చేపట్టామని కేంద్ర ప్రభుత్వం ను మన రాష్ట్ర ప్రభుత్వం కోరగా సరిపడా ట్రాఫిక్ లేదు అని మెట్రో విస్తరణను అడ్డుకున్నారు అని కేంద్ర ప్రభుత్వం పై ప్రభుత్వ విప్ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేసారు .కానీ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టి తో, మన తెలంగాణ ప్రభుత్వం స్వంత నిధులతో మెట్రో కారిడార్ ను మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు విస్తరణ కు చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం చాలా సంతోష కరమైన విషయం అని , ముఖ్యమంత్రి కేసీఆర్ కి, మంత్రి కేటీఆర్ కు నా తరుపున శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.

వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాలు అదే స్థాయిలో ఉండాలనే లక్ష్యంతో ప్రజారవాణాను విస్తృత పరచాలని సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకున్నది అని,నగరం ఎంత పెరిగినా.. ఎన్ని పరిశ్రమలు వచ్చినా.. లక్షలాది మంది ప్రజలు వచ్చినా తట్టుకునేలా.. విశ్వనగరంగా ఎదగడానికి, అన్నిహంగులతో కూడిన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు మెట్రోను నగరం నలువైపులా విస్తరించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం చాలా గొప్ప విషయం అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.


ప్రజా సౌకర్యార్థం మియాపూర్ చౌరస్తా నుండి BHEL చౌరస్తా వరకు పూణే నమూనా ప్రకారం మెట్రో మార్గం మరియు ఫ్లై ఓవర్ ను ఒకే పిల్లర్ మీదుగా వచ్చే విధంగా నూతనంగా నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, ఈ రోడ్డు మీద మియాపూర్ చౌరస్తా, ఆల్విన్ చౌరస్తా ల మీదుగా నిత్యం రోజు వారిగా లక్ష కు పైగా వాహనాలు ప్రయనిస్తున్నాయి అని, ఈ టాఫిక్ ఇక్కట్లు తప్పడానికి రెండు చౌరస్తాల మీదుగా BHEL వరకు ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టాలని, ఈ విధానం ద్వారా నిర్మాణం సాఫీగా సాగునని, స్థలం సేకరణ, భవనాల తొలగిపు వంటి ఇతర అంశాలు అవసరం ఉండదు అని తక్కువ ఖర్చుతో త్వరితగతిన నిర్మాణం జరుగునని, ఫ్లై ఓవర్ నిర్మాణము సులభతరం అవుతుంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేశారు.


,హైదరాబాద్ ను విశ్వనగరం గా తీర్చి దిద్దే క్రమంలో భాగంగా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు పెంపొందించుటకు మౌలిక వసతుల కల్పనకై ముఖ్య మంత్రి కెసిఆర్ గొప్ప ఆలోచనల మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో IT రంగం , అతి పెద్ద భవనాలు, అత్యధిక ప్రజానీకం నివాసితున్న ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమైన పరిస్థితుల్లో ముఖ్య మంత్రి KCR దూర దృష్టితో మరియు మంత్రి KTR ప్రణాళికలతో శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజల ట్రాఫిక్ సమస్యల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనేక ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ లు లింక్ రోడ్లు వంటి అభివృద్ధి చేయడం అంటే బహుశా 50 యేండ్ల చరిత్రలో ఇది మొట్టమొదటి సరిగా గొప్ప చరిత్ర అని చెప్పుకోవడానికి శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజానీకానికి ,మాకు గౌరవంగా ఉందని చెప్పడానికి చాల సంతోషిస్తున్నాను అని ,అదేవిధంగా బ్రహ్మాండంగా ఫ్లై ఓవర్లు ,అండర్ బ్రిడ్జిలు, కొత్త రోడ్లు వేయడం జరిగినది .చాల సంతోషంగా ఉంది అని ప్రభుత్వ విప్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు,వార్డ్ మెంబర్లు,ఏరియా కమిటీ ప్రతినిధులు,ఉద్యమకారులు, పాత్రికేయ మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది.


SAKSHITHA NEWS