SAKSHITHA NEWS

వరద నివారణ చర్యల్లో భాగంగా హైదరాబాద్ మహానగరంలో వర్షాకాలంలో మురికినీరు సాఫీగా ప్రవహించేలా డ్రెయిన్లు, కాలువలుపై ఉన్న నిర్మాణాలని తొలగించేందుకు జిహెచ్ఎంసి అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. భారత్ నగర్ న్యూ హెచ్ఐజి వద్దగల నాలా నీటి ప్రవాహానికి అంతరాయం కలిగించేలా ఉన్న మెట్రో స్టేషన్ బాత్రూమ్ లను వెంటనే తొలగించి సూచించిన విధంగా మరోచోట ఏర్పాటు చేసుకోవాలని హెచ్ఎంఆర్ అధికారులను ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ కోరారు.
హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు డిఈ రామకృష్ణ, ఏఈ రంజిత్ తోకలిసి భారత్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద పర్యటించారు, ఇందులో భాగంగా హెచ్ఎంఆర్ నిర్మించిన బాత్రూంలో వలన క్రింద ఉన్న నాలా ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుందని, దానివలన పరిసర ప్రాంతాలు వర్షాకాలంలో ముంపుకి గురవుతున్నాయని కార్పొరేటర్ అధికారులకు తెలిపారు. కావున సూచించిన విధంగా బాత్రూమ్ లను మరోచోట నిర్మించాలని అధికారులకు తెలిపారు. సానికూలంగా స్పందించిన హెచ్ఎంఆర్ అధికారులు సంబంధిత పనులను ఉన్నత అధికారులతో చర్చించి వెంటనే ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో.


SAKSHITHA NEWS