కాలువ నిర్మాణం వల్ల వరద నీటి ప్రవాహం దారి మళ్లించి దూలపల్లి రాహదారి పై ప్రజారవాణాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యాన్మాయ ఏర్పాట్లు చేస్తున్నాం:- ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ..
సాక్షిత : కుత్బులాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి ప్రధాన రహదారి పై నిర్మిస్తున్న నాలా పనులను ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నాలా నిర్మాణం వల్ల ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహం దారి మళ్లించి ప్రజారవాణాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యాన్మాయ ఏర్పాట్లను చూడాలని మున్సిపల్ శాఖ, SNDP ఇంజినీరింగ్ శాఖ మరియు ట్రాఫిక్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ వెంకట్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ శ్రీ హరి, పాక్స్ చైర్మన్ నరేందర్ రాజు, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గంగయ్య, కొంపల్లి మున్సిపాలిటీ బి.ఆర్ఎ.స్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి మరియు కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.