భౌరంపేట్, బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీల్లో మంచినీటి కనెక్షన్లపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష…
సాక్షిత : కుత్బుల్లాపురం నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని భౌరంపేట్, బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీల్లో మంచినీటి (బల్క్ సప్లై) కనెక్షన్ల విషయమై ఎమ్మెల్యే కేపి వివేకానంద్ వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా మంచినీటి కనెక్షన్లు మంజూరు చేయాలని హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్.ఎస్.బి. ఎండి దాన కిషోర్ తో ఎమ్మెల్యే మాట్లాడి ఒప్పించారు.
ఈ విషయమై అధికారులు ప్రత్యేక దృష్టి వహించి మున్సిపాలిటి ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి కనెక్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని 10 రోజుల్లో నీటి సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా సూరారం నుండి బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీకి 1.5 MLD, నిజాంపేట్ నుండి 2 MLD భౌరంపేట్ ఇందిరమ్మ కాలనీకి కేటాయించాలని ఎమ్మెల్యే ట్రాన్స్ మిషన్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కమిషనర్ సత్యనారాయణ, జీఎంలు సంతోష్, శ్రీధర్, కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు మురళి యాదవ్, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.