SAKSHITHA NEWS

అంబరాన్నంటిన కాకతీయ కమ్మ సంక్షేమ సంఘ వనభోజనం మహోత్సవాలు
(నవంబర్ 10, సాక్షిత ప్రతినిధి కోదాడ) సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో
ఆధ్యాత్మికతకు ఐక్యతకు స్నేహభావాలకు కార్తీక మాస వనభోజన మహోత్సవాలు ప్రతీకలు అని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు ఆదివారం కోదాడ పట్టణంలోని ద్వారకుంట ఇండస్ట్రీస్ ఏరియా సమీపంలోని ఎర్నేని వెంకటరత్నం బాబు మామిడి తోటలో ఏర్పాటుచేసిన కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం కార్తీక వనభోజన మహోత్సవాల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా కార్తీక మాస వనభోజన మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్తీక మాస వనభోజన మహోత్సవాల ద్వారా ఆధ్యాత్మిక భావాలు సభ్యుల మధ్య సోదర భావాలు పెంపొందుతాయన్నారు సామాజిక సేవా రంగాల్లో కాకతీయ కమ్మ కులస్తులు అగ్రస్థానంలో నిలిచి అందరి కి ఆదర్శంగా ఉండాలన్నారు. కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు మాట్లాడుతూ పూర్వం నుండి సమాజ శ్రేయస్సు కోసం వనభోజన మహోత్సవాలు ఆచారంగా నిర్వహిస్తున్నామని ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్న కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం అభినందనీయమన్నారు ప్రజలందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు తెలిపారు కాగా కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్నేని బాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ కాకతీయ కమ్మ వనభోజనాలకు కోదాడ మేళ్లచెరువు పరిసర గ్రామాల క మ్మ కుటుంబ సభ్యులు భారీగా తరలివచ్చారు పూజా కార్యక్రమాలతో పాటు ఆటపాట కార్యక్రమాలతో సాంస్కృతిక ప్రదర్శనలతో వనభోజన మహోత్సవం దిగ్విజయంగా కొనసాగింది. అనంతరం ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ ను కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి గజమాలతో ఘనంగా సన్మానించారు.


SAKSHITHA NEWS