SAKSHITHA NEWS

సూర్యాపేట సాక్షిత ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టూ 2కే రన్‌ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి జెండా ఊపి 2కే రన్‌ను ప్రారంభించారు. 2కె రన్ కొత్త బస్టాండ్ నుండి సద్దుల చెరువు టాంక్ బండ్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ తెచ్చిన తెలంగాణ ఫలితాలను కొత్త తరం ఎంజాయ్ చేయాలని, ఫలితాలను అందిపుచ్చుకుని యువతీ యువకులు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని పిలుపునిచ్చారు.

స్వరాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్‌ సర్కారు యువత బాగుకు, వారి సంక్షేమం కోసం తపిస్తు న్నదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా, ప్రైవేట్‌లో ముఖ్యంగా ఐటీ రంగంలో అవకాశాల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది. 2014కు ముందుతో పోల్చితే గత తొమ్మిదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు మెరుగయ్యాయని అన్నారు. యువత వ్యసనాలకు బానిసకాకుండా విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం వినూ త్న మార్పులు తీసుకువచ్చిందన్నారు. నిరుపేద విద్యార్థుల కోసం గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, ఉన్నత విద్య కోసం స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నదన్నారు. ఉద్యోగాల కల్పన కోసం ప్రణాళికతో ముందుకెళ్తున్నదన్నారు.

ముందుగా మన ఉద్యోగాలు మన బిడ్డలకే దక్కాలన్న లక్ష్యం తో సమైక్య రాష్ట్రంలో ఉన్న జోనల్‌ విధానంలో సీఎం కేసీఆర్‌ సమూల మార్పులు తెచ్చారన్నారు. ఉద్యోగుల పదోన్నతులు, బదిలీల విషయంలో శాస్త్రీయత లోపించడం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్‌ పాత జోనల్‌ విధానాన్ని సమూల ప్రక్షాళన చేశారన్నారు. 95 శాతం ఉద్యోగాలు ఈ ప్రాంత బిడ్డలకే దక్కాలన్న ల క్ష్యంతో కొత్త జోనల్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాకే హక్కులను సాధించుకోగలిగాం అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెచ్చిన కల్యాణ లక్ష్మి, రైతుబంధు ,రైతు బీమా ,ఆసరా పెన్షన్ల ,వంటి ఎన్నో పథకాలు తెలంగాణ తెలంగాణ రాష్ట్రం లో, ఇక్కడి ప్రజల జీవితాల్లో అలుముకున్న చీకట్లను పారద్రోలాయి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోతే, ముఖ్యమంత్రిగా కేసీఆర్ కాకపోతే,మెడికల్ కాలేజీలు రాకపోయేవి అన్నారు.

వచ్చిన మెడికల్ కాలేజ్ లతో ఎంతో మంది యువత వైద్య విద్యను అభ్యసిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇవన్నీ మరి రాష్ట్ర ఏర్పాటు వల్లనే సాధ్యమైందని మంత్రి అన్నారు. యువతీ యువకులు ప్రభుత్వం అందించే తోడ్పాటు ను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని మంత్రి జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో కలెక్టర్ వెంకట్రావ్, అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, మున్సిపల్ ఛైర్మన్ అన్నపూర్ణ, జడ్పీ వైస్ ఛైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, గ్రంధాలయ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ , మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి అధికారులు పోలీసు సిబ్బంది యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS