నిరుపేదలకు ఆసరాగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు – ఎమ్మెల్యే చిరుమర్తి

Spread the love

రామన్నపేట సాక్షిత ప్రతినిధి
రామన్నపేట మండలంలోని ఎన్నారం గ్రామంలో రూ. 60 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతీ సంక్షేమ పథకం పేదోడికి ఆసరా అవుతున్నాయని
గతంలో మునుపెన్నడూ చెయ్యని అభివృద్ధి కేవలం కేసీఅర్ తోనే సాధ్యమైందని కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎక్కడా వెనకడుగు వెయ్యని దమ్మున్న నాయకుడు కేసీఅర్ అని అన్నారు. ఎంత నష్టమైనా రైతు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని కేసీఅర్ సారథ్యంలో రాష్ట్రంలో నీళ్ళు, కరెంట్ పుష్కలంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పండుగ వాతావరణంలో దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయని అన్నారు.


ప్రతి గ్రామం సుభిక్షంగా ఉండాలన్నదే మా ఆకాంక్ష అని ఎన్నారం గ్రామం మీద అపారమైన ప్రేమతోనే ఎక్కువ నిధులిచ్చామన్నారు. అన్ని విధాలుగా ఎన్నారం గ్రామం ముందుండాలనే 1 కోటి పై చిలుకు నిధులు గ్రామానికి కేటాయించామని, 22 లక్షలతో మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు పూర్తి చేశామని
గ్రామస్థులందరి తోడ్పాటుతోనే ఆంజనేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణం సాధ్యం
అవుతుందన్నారు. మీఅందరికి తోడుగా దేవాలయ పునర్నిర్మాణానికి నా వంతుగా 5 లక్షలు విరాళమిస్తానని అన్నారు.
పార్టీలకతతంగా కెసిఆర్ ప్రభుత్వానికి అండగా ఉండి, గ్రామాభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం యాదవ్, సర్పంచ్ మెట్టు మహేందర్ రెడ్డి వివిధ హోదాలలో ఉన్న నాయకులు, అధికారులు, కార్యకర్తలు
తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page