*”అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టాం” – మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి*
*SPS నెల్లూరు జిల్లా:*
తేది:14-05-2023
*నిన్న, శనివారం నాడు, సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, ఈదూరు గ్రామ సచివాలయ పరిధిలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా ఈదూరు, మిట్టపాళెం, రాయపురం, ఇసుకదొరువు గ్రామాలలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*
*మంత్రికి భారీ గజమాలలతో సత్కరించి, ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు, స్థానిక నాయకులు.*
*ప్రతి గడపలోనూ మంత్రికి మంగళహారతులతో స్వాగతం పలికిన ప్రజలు.*
*ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ…*
👉గ్రామాల్లో ప్రజలు కోరుకున్న అభివృద్ధి పనులు చేపట్టడం, సంపూర్ణంగా సంక్షేమ పథకాలు అందించడమే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం.
👉తోటపల్లి గూడూరు మండలంలో మరో సచివాలయం మినహా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తి కావచ్చింది.
👉ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టి, పూర్తి చేస్తున్నాం.
👉 తాను ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసి, సంక్షేమ పథకాల ద్వారా మీకు లబ్ది జరిగి ఉంటేనే, తనకు తోడుగా ఉండండి అంటున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.
👉ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాము, ప్రజలు కోరుకున్న అభివృద్ధి పనులను గుర్తించి చేపడుతున్నాం.
👉గడపగడప కార్యక్రమంలో ప్రజలు కోరుకున్న అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించడం, ఆ పనులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాం.
👉సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అనేక సమస్యలకు పరిష్కార మార్గం చూపుతున్నాం.
👉దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న చుక్కల భూముల సమస్యను పరిష్కరించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది.
👉 అన్ని రకాలుగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందించడంతో పాటు, గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం