సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం చీమలపాడు అగ్నిప్రమాద ఘటనలో క్షతగాత్రులైన వారిని మెరుగైన చికిత్స కోసం ఖమ్మం నుండి హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు. ఐటి పురపాలక శాఖ మంత్రి కేటిఆర్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపిలు నామా నాగేశ్వరరావు, వద్ధిరాజు రవిచంద్ర నిమ్స్ ఆసుపత్రికి వెళ్ళి క్షతగాత్రులను కలిసి పరామర్శించారు. ఏమి అధైర్య పడొద్దు అని, వారి కుటుంబాలు ధైర్యం కల్పించారు. పూర్తిగా కోలుకునే వరకు అన్ని రకాల వైద్య చికిత్సలు ఉచితంగానే అందిస్తామని, దైర్యం కోల్పోవొద్దు దైర్యం చెప్పారు. ఎలాంటి వైద్య సేవలైన తక్షణమే అందించాలని, పూర్తిగా కోలుకునేవరకు మెరుగైన చికిత్సలను అందించాలని వైద్యులను, నిమ్స్ అధికారులను మంత్రులు అదేశించారు
చీమలపాడు ఘటన క్షతగాత్రులను పరామర్శించిన మంత్రులు కేటిఆర్, పువ్వాడ..
Related Posts
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తాం – మాజీ ఎమ్మెల్యే, శ్రీశైలం గౌడ్
SAKSHITHA NEWS కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తాం – మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్.. కుత్బుల్లాపూర్ నియోజక వర్గం: మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ ని తన నివాసం వద్ద…
ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్
SAKSHITHA NEWS ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ శంకర్పల్లి: ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలని శంకర్పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో వైద్య అధికారులతో…