SAKSHITHA NEWS


MLA KP Vivekanand in the Assembly on the development work being done in SRDP

ఎస్‌ఆర్‌డీపీలో చేపడుతున్న అభివృద్ధి పనులపై అసెంబ్లీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రస్తావన…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో రోడ్లు, జంక్షన్లు, ఫ్లై ఓవర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే…

ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి కేటీఆర్…

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఎస్‌ఆర్‌డీపీ ద్వారా చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులపై కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మాట్లాడారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సభాపతి ద్వారా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రాం (ఎస్‌ఆర్‌డీపీ) కింద నగర నలుమూలలా చేపడుతున్న ఫ్లైఓవర్లు, రోడ్ల అభివృద్ధి పనుల ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు.

సికింద్రాబాద్ పారడైజ్ నుండి బోయిన్ పల్లి వరకు సిఖ్ విలేజ్ మీదుగా.. ప్యాట్నీ నుండి కరీంనగర్ వెళ్లే రోడ్లలో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని, అయితే డిఫెన్స్ వారి ఆధీనంలో ఉన్నందున ఎస్‌ఆర్‌డీపీ కింద అభివృద్ధి పనులు చెప్పట్టలేక పోతున్నామని సమస్య పరిష్కారానికి డిఫెన్స్ ద్వారా అనుమతి వచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ని కోరారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ నుండి జేఎన్టీయూ వైపు వెళ్లే రోడ్డులో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఎదురవుతుందని సమస్య పరిష్కారానికి ఎస్‌ఆర్‌డీపీ కింద ఫ్లై ఓవర్ చేపడితే బాచుపల్లి, ప్రగతి నగర్, భౌరంపెట్, మల్లంపేట్ ప్రాంత ప్రజలకు వెసులుబాటు కలుగుతుందని మంత్రి కేటీఆర్ ని కోరారు.

కోట్ల రూపాయల నిధులతో ఎస్‌ఆర్‌డీపీ కింద బాచుపల్లి వద్ద ఫ్లైఓవర్, మల్లంపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ – ఎంట్రీ నిర్మాణ పనులు జరుగుతున్నాయని, సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్డులో స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.56 కోట్ల నిధులు, మీయాపూర్ నుండి గండిమైసమ్మ వరకు రోడ్డు అభివృద్ధికి నిధులు మంజూరు చేసి ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నందుకు మంత్రి కేటీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.

జిహెచ్ఎంసితో పాటు ఓఆర్ఆర్ వైపు హెచ్ఎండిఏ పరిధిలో పెద్ద ఎత్తున హైరైజ్ కమ్యూనిటీలు రావడంతో ఒక గ్రామం మాదిరిగా జనాభా పెరుగుతుందని, కొంపల్లి ప్రాంతంలో గేట్ వే ఐటీ పార్కు రాకతో జనాభా అంచనా వేసి ఎస్‌ఆర్‌డీపీ కింద రోడ్ల వెడల్పు, జంక్షన్ల అభివృద్ధి, లింకు రోడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, మాస్టర్ ప్లాన్ లో భాగంగా రోడ్లకు ఇబ్బందులు లేకుండా, ఎస్ఎన్ డిపి కింద నాలాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ని కోరారు.

మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ…

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే అనేక పనులు పూర్తి చేశామని, మిగిలిన పనులు కూడా పూర్తి చేసి హైదరాబాద్ నగర ప్రజలకు పూర్తి స్థాయిలో ఎస్‌ఆర్‌డీపీ ఫలాలు అందిస్తామని అన్నారు.

హైదరాబాద్ నగర ట్రాఫిక్ సమస్యలు అధిగమించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని, ఈ పనులన్నీ వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో ప్రభుత్వం పని చేస్తూ గత ఎనిమిది ఏళ్లుగా ప్రతీ రక్షణ శాఖ మంత్రిని, పలు మార్లు ప్రధాన మంత్రిని కలిసి వినతులు, విజ్ఞప్తి చేస్తున్నా అనుమతులు ఇవ్వకపోవడం బాధాకరం అన్నారు.

పాట్నీ నుండి సుచిత్ర వరకు స్కై వే కట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడం సిగ్గుచేటు అన్నారు. ప్రజల అవసరాల మేరకు చేపట్టే పనుల విషయంలో కేంద్రం వివక్ష చూపడం సరైన పద్ధతి కాదని, ఇకనైనా ముందుకు రావాలని అన్నారు.


SAKSHITHA NEWS