Commissioner of Police who inaugurated the office of Circle Inspector
సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన పోలీస్ కమిషనర్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
అధునిక సౌకర్యాన్ని జోడించి పునరుద్ధరించబడిన సింగరేణి సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ) కార్యాలయాన్ని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ ప్రారంభించారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ పాత కార్యాలయం ఇటీవల శిధిలావస్థలో చేరడంతో పునరుద్ధరణ పనులు చేపట్టి పూర్తి చేశారు.
అదేవిధంగా కమ్యూనిటీ పోలిసింగ్ లో భాగంగా కారేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ…పోలీస్ సేవలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు, ప్రజావసరాలకు అనుగుణంగా పోలీస్ కార్యాలయ భావాలను తీర్చిదిద్దుతూ..పోలీస్ శాఖను మరింత బలోపేతం చేసేదిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మెరుగైన సమాజం కోసం నేనుసైతం, కమ్యూనిటీ పోలిసింగ్ లో భాగస్వామ్యమై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఖమ్మం పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టిని సారించిందని, ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా కెమెరాలతో నిఘా నీడల్లోకి తీసుకొచ్చి… ప్రజల రక్షణగా ఉండాలనే లక్ష్యంతో టెక్నాలజీ పరమైన సంస్కరణలు తీసుకురావడం సంకల్ప
లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని అన్నారు.
24 గంటలు నిర్విరామంగా పనిచేసే ఒక సీసీ కెమెరా వందమంది కానిస్టేబుళ్లతో సమానమని అన్నారు. మీ ప్రాంతాలలో అపరిచిత వ్యక్తుల కదలికలు, అసాంఘీక కార్యకాలపాలు, గుర్తించడానికి సీసీ కెమెరాలు ఎంతోగానో సహకరిస్తాయని అన్నారు.
నేరస్ధులు కూడా కొత్త తరహా పద్ధతులను ఎంచుకుని నేరాలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న ప్రస్తుత తరుణంలో సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతున్నాయని అన్నారు. కార్యక్రమంలో ఖమ్మం రూరల్ ఏసీపీ భస్వారెడ్డి, సిఐ ఆరీఫ్ ఆలీ ఖాన్, ఎస్సై పాల్గొన్నారు.