SAKSHITHA NEWS

Jagananna’s Maha Yajna Mee Bhoomi Ma Hami MLA Bhoomana

జగనన్న చేపడుతున్న మహాయజ్ఞం మీ భూమి మా హామి : ఎమ్మెల్యే భూమన


సాక్షిత తిరుపతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వంద సంవత్సరాల తరువాత పట్టణ ప్రాంతాలలో స్థిరాస్తుల సర్వే చేయించాలని వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష పథకం అమలు కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న మహా యజ్ఞం మీ భూమి మా హామీ అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.

మీ భూమి మా హామి భూ రక్షా పథకం పై తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో తిరుపతి నగరపాలక సంస్థ ముద్రించిన కరపత్రాలను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరికృష్ణ, డిప్యూటీ మేయర్ లు భూమన అభినయ రెడ్డి, ముద్ర నారాయణలు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ ఎప్పుడో బ్రిటిష్ వారి హయాంలో భూమికి సంబంధించిన సర్వేలు జరిగి ఉంటే వాటినే ప్రాతిపదికగా ఇప్పటివరకు ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వాలు రెవెన్యూ రికార్డులు అన్నీ కూడా దానిపైనే ఆధారం చేసుకుని నడవడం జరిగిందని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నూరేళ్ల తరువాత మళ్లీ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమి అంతటిని రీసర్వ్ చేయించి ఎక్కడ ఏ చిన్న లొసుగులు లేకుండా ఎవరెవరికి వారి సొంత ఆస్తులు ఎంత ఉన్నాయో,

ప్రభుత్వ భూమి ఏదైతే ఉన్నదో, అనేక రకాలుగా ఉన్నటువంటి భూములన్నిటిని కూడా సర్వే చేయించి శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష పథకం జగనన్న పేరు మీద చేపట్టడం జరిగిందన్నారు. ఎలాంటి వివాదాలకు చోటు ఇవ్వకుండా ఒకసారి పట్టా ఇచ్చిన తర్వాత మళ్లీ మరొకరు దానిని క్లైమ్ చేసుకొని చాలా మటుకు వివాదాలు రేపట్టకుండా ఈ పథకం ఉపయోగ పడుతుందన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా మరీ వివాదాలు అతి ఎక్కువగా ఉండేటువంటి పట్టణ ప్రాంతాలకు మరింత ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని మీ భూమి మా హామి అన్న పేరుతో నిర్వహించడం జరుగుతుందన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరికృష్ణ మాట్లాడుతూ సమగ్ర రీ సర్వే ద్వారా రెవెన్యూ రికార్డుల వివరాలు డిజిటల్ రూపంలో భూ కమతం, పట్టణ సర్వే పటం, రీ సర్వే ల్యాండ్ రిజిస్టర్, పట్టణ సర్వే పటం, 1బి రిజిస్టర్, శాశ్వత భూహక్కు పత్రములు తయారు చేయబడిన సమగ్ర రీసర్వే చేయు విధానము,

ఇందువలన కలుగు ప్రయోజనాలను ప్రతి స్థిరాస్తిదారునికి తెలియజేయడానికి వార్డు సభలను ఏర్పాటు చేయడం, సర్వే విధి విధానాలు, సర్వే ప్రయోజనాలను వివరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సునీత, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS