పీజేఆర్ నగర్ కాలనీలో డ్రైనేజీ మరియు రోడ్ల పెండింగ్ వర్క్స్

Spread the love


Pending Works of Drainage and Roads in PJR Nagar Colony

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్ కాలనీలో డ్రైనేజీ మరియు రోడ్ల పెండింగ్ వర్క్స్ ఉన్నాయని కాలనీ ప్రజలు స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకునిరాగా కార్పొరేటర్ పీజేఆర్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు జి.ఎచ్.ఎం.సి అధికారులతో కలిసి పాదయాత్ర చేసి సమస్యలను స్వయంగా పరిశీలించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పీజేఆర్ నగర్లో అభివృద్ధి పనులన్నీ దాదాపు పూర్తయ్యాయని, పెండింగులో ఉన్న డ్రైనేజీ మరియు రోడ్లను త్వరితగతిన పూర్తైయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. నిర్మాణ దశలో ఉన్న సీసీ రోడ్లను పరిశీలించిన కార్పొరేటర్ సంబంధిత అధికారులతో మాట్లాడి సీసీ రోడ్లను నాణ్యత ప్రమాణాలతో వీలైనంత త్వరగా నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, ప్రధానకార్యదర్శి గుడ్ల శ్రీనివాస్, షౌకత్ అలీ మున్నా, అగ్రవాసు, రాములుగౌడ్, మౌలానా, సంగమేష్, యాదగిరి, రాజుపాటేల్, వాసుదేవరావు, పోశెట్టిగౌడ్, దేవేందర్, కటికరవి, జానయ్య, సంపత్, బాలరాజు, డివిజన్ అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, డివిజన్ అధ్యక్షురాలు మధులత, పుట్టం దేవి, రేణుక, సురేఖ, ప్రీతి, వెంకటలక్ష్మి వర్క్ ఇస్పెక్టర్ రవికుమార్, సూపర్వైజర్ శివ తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page