SAKSHITHA NEWS

Dharna will be held under the leadership of the Youth Congress in front of the government hospital at Chakali Ailamma statue

image 16

ఈరోజు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ప్రభుత్వ ఆసుపత్రి ముందు యూత్ కాంగ్రెస్ మొహమ్మద్ సజ్జు భాయ్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించడం జరిగింది.*

స్థానిక హుజురాబాద్ ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రి నందు గ్రేట్ టు ఫార్మసిస్ట్ హోదాలో ఉన్నటువంటి ఉద్యోగి విధులకు హాజరు కాకుండా సెలవు ప్రకటించకుండా విధులకు హాజరైతునట్లు హాజరు పట్టిలో సంతకాలు ఫోర్జరీ చేస్తున్నారని జిల్లా అధికారులకు గత నెల 29వ తేదీన ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో యూత్ కాంగ్రెస్ హుజురాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు సజ్జాద్ మహమ్మద్ మాట్లాడుతూ దావకాన అంటే రోగులకు ఒక దేవాలయం గా భావించేటువంటి దావఖానాల పరిస్థితి ఈ విధంగా ఉంది అంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి మరియు సంబంధిత శాఖ జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ గారికి ఫిర్యాదు చేసినప్పటికీ ఈరోజు వరకు ఎటువంటి విచారణ చేయకుండా సంతకాలు ఫోర్జరీ చేసిన , చేయించిన ఉద్యోగిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రజల ప్రభుత్వం ఆదాయాన్ని గండి కొట్టడం జరుగుతుంది .

ఇదేంటని ప్రశ్నించిన యూత్ కాంగ్రెస్ నాయకులను నిర్లక్ష్యపు సమాచారం చెబుతూ నేరస్తులకు కొమ్ము కాయడం జరుగుతుంది ఇది ఇలాగే కొనసాగితే ప్రభుత్వం, ప్రజల సొమ్మును దోచుకోవడానికి వీరికి అడ్డంకులు ఉండవని సదరు ఉద్యోగి , వారికి సహకరిస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోతే ఇంకా అలసత్వం వహిస్తే చర్యలు తీసుకునేంతవరకు ఈ ఉద్యమాన్ని ఆపమని హెచ్చరిస్తున్నాం.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి సొల్లు బాబు, హుజరాబాద్ మండల అధ్యక్షులు
కొల్లూరి కిరణ్, మైనార్టీ సెల్ హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు అప్సర్ మహమ్మద్, కొలిపాక శంకర్ , నేహాల్ , యూత్ కాంగ్రెస్ నాయకులు , మునిగంటి రాకేష్ రెడ్డి , గుండారపు సాయికుమార్ , సంపత్ , నరేష్ , జక్కుల రమేష్ , ఫయాజ్, రాజేష్ , జియా , సాంబయ్య తదితరులను హుజరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.


SAKSHITHA NEWS