Salute to the martyred yellow soldiers in Kandukur Sabha
కందుకూరు సభలో అమరులైన పసుపు సైనికులకు శ్రద్ధాంజలి ఘటించిన: కూరపాటి
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ఖమ్మంజిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటలో 18 మంది గాయపడ్డారు అందులో ఎనిమిది మంది మృతి చెందారు, ఈ సంఘటనకు తెలుగు రాష్ట్రాల టిడిపి శ్రేణులు దిగ్బ్రాంతి గురి చేసింది, దీనిలో భాగంగా ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ కందుకూరులో సభ మధ్యలో అపశ్రుతి అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగుదేశంపార్టీ కుటుంబ సభ్యులైన మన కార్యకర్తల మృతి పార్టీకి తీరనిలోటనీ వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా అన్నారు. చంద్రబాబు నాయుడు స్వయంగా హాస్పిటల్ కి వెళ్లి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు. వారంతా త్వరగా కోలుకోవాలని ఆయన హాస్పిటల్ వాళ్ళతోమాటాడారనీ, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి పదిలక్షల రూపాయలు అందిస్తామన్నారు.
వారికుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటుందని, ప్రతీ చిన్నవిషయానికీ దగ్గరుండి చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందనీ, భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకూడదని దేవున్ని ప్రార్థిస్తున్నాను అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మృతుల చిత్రపటాలకు నివాళులర్పించారు అంతేకాక తెలంగాణ రాష్ట్రంలోని అన్నిచోట్ల టీడీపి నాయకులు అమరులైన పసుపు సైనికులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుత్తా సీతయ్య, నగర అధ్యక్షులు వడ్డే విజయ్, రాష్ట్ర కార్యదర్శి సానబోయిన శ్రీనివాస్ గౌడ్, టి ఎన్ టి యు సి రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి భాస్కరరావు,తెలుగు యువత అధ్యక్షులు నల్లమల రంజిత్, నగర కార్యదర్శి గుండపిన్ని నాగేశ్వరరావు, డివిజన్ అధ్యక్షులు మేడ శ్రీనివాస్, చింత నిప్పు నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.