SAKSHITHA NEWS

Financial assistance to tribals at Kakani’s hands”

గిరిజనులకు కాకాణి చేతుల మీద ఆర్థిక సహాయం”


సాక్షిత నెల్లూరు జిల్లా : సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలంలో నూతనంగా ఇళ్లు నిర్మించుకుంటున్న పేద గిరిజన కుటుంబాలకు 15 వేల రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .*

వెంకటాచలం మండలంలో 283 గిరిజన కుటుంబాలకు 15వేల రూపాయల చొప్పున 42.5లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన మంత్రి కాకాణి.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం.

జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా, 32 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు అందించారు.

ఇళ్ల స్థలాలు అందించడంతోపాటు, ఇళ్లు నిర్మించే బాధ్యత కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు.

ఇళ్లు నిర్మించుకునేందుకు ఒక లక్ష 80వేల రూపాయల ఆర్థిక సహాయంతో పాటు, స్వయం సహాయక గ్రూపు మహిళలకు 35వేల రూపాయలు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారు.

నిరుపేద గిరిజనులు తమ ఇళ్లు నిర్మించుకోవడంలో వెనకబడి పోకూడదని, సర్వేపల్లి నియోజకవర్గంలోని నిరుపేద గిరిజన కుటుంబాలకు 15 వేల రూపాయల చొప్పున అదనంగా ఆర్ధిక సహాయం అందిస్తున్నాం.

సర్వేపల్లి నియోజకవర్గంలో 3500 గిరిజన కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన వెంటనే, 15వేల రూపాయలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం.

“దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు”! అన్న మాటలతో చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోయాడు.

దళితులు, వెనుకబడిన వర్గాల పట్ల అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎంత ఏహ్య భావంతో మెలిగాడో చెప్పనలివి కాదు.

అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నా..


SAKSHITHA NEWS