విద్యతో పాటు క్రీడల్లోనూ నైపుణ్యం సాధించాలని విద్యార్థులకు సూచించిన ఎమ్మెల్యే బొల్లా

Spread the love

MLA Bolla advised the students to excel in sports along with education

విద్యతో పాటు క్రీడల్లోనూ నైపుణ్యం సాధించాలని విద్యార్థులకు సూచించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

సాక్షిత : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలలో భాగంగా వినుకొండ పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గ్రౌండ్ నందు విద్యార్థులకు ఆటల-పోటీలను నిర్వహించారు.

అనంతరం పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ నైపుణ్యత సాధించి, మన ప్రాంతానికి మంచి గుర్తింపు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.

విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా అనేక రకాల వసతులను కల్పిస్తూ, విద్యకు పెద్ద పీట వేశారని అన్నారు. అమ్మఒడి, విద్యా కానుక, వసతి దీవెన, ఫీజు రియింబర్స్మెంట్ లాంటి అనేక పథకాలతో పాటు గోరుముద్ద అనే పథకం ద్వారా విద్యార్థులకు మంచి భోజనం వసతి కల్పిస్తూ వారి అభివృద్ధికి దోహద పడుతుందన్నారు..

Related Posts

You cannot copy content of this page