It is the responsibility of everyone to protect Dharma
ధర్మాన్ని పరిరక్షించే బాధ్యత అందరి పైన ఉంది
*బడి ,గుడి ,అమ్మ వడి అనేవి సంస్కార కేంద్రాలు వాటిని పరిరక్షించు కోవాల్సి భాద్యత అందరిదీ *
నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి షాద్నగర్ బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి
రంగారెడ్డి జిల్లా సాక్షిత
ఈరోజు షాద్నగర్ నియోజకవర్గం ఎలుక గూడెం గ్రామంలో నూతనంగా పునర్నిర్మానం చేసిన ఆంజనేయ స్వామి గుడిలో విగ్రహ ప్రతిష్ట ,ధ్వజ స్తంభం ప్రతిష్ట కార్యక్రమంలో నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి ఎలుక గూడెం గ్రామ సర్పంచ్ ప్రతాపరెడ్డి ,షాద్నగర్ బిజెపి సీనియర్ నాయకులు అందే బాబయ్య, భూపాల చారి, పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, కోనేరు శ్రీనివాస్, రవీందర్ రెడ్డి ,యాదయ్య అనిల్, ఆకుల ప్రదీప్ అంజిపాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దేవాలయాలు బడి ఆధారంగా, గుడి ఆధారంగా ,అమ్మ ఒడి ఆధారంగా సంస్కారం ఇచ్చేటటువంటి కేంద్రాలు. వీటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉంది అని ,హిందూ ధర్మాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మన అందరి పైన ఉంది అని అన్నారు
.మనకు వ్యక్తిగతమైన భక్తి ఎంత అవసరమో, సామూహిక భక్తి భజనలు, ఉత్సవాలు చేయడం వల్ల సమాజంలో ఒక శక్తి వస్తుందని ఈ శక్తి మనందరినీ కాపాడుతుంది కాబట్టి మనం కులాలు అనేది పక్కన పెట్టి హిందువులం అనే భావనతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అన్నారు.
ఈ కార్యక్రమములో గ్రామా పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు .