SAKSHITHA NEWS

Newborn care week celebrations

నవజాత శిశువు సంరక్షణ వారోత్సవాలు
డాక్టర్ ఎస్ జయలక్ష్మి డిప్యూటీడి ఎం అండ్ హెచ్ ఓ షాద్నగర్

రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి

షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత సంరక్షణ వారవత్సవాల భాగంగా కాన్పు తల్లులకు అప్పుడే పుట్టిన పిల్లల యొక్క సంరక్షణ ఏ విధంగా తీసుకోవాలో డాక్టర్ ఎస్ విజయలక్ష్మి గారు తల్లులకు వివరించారు బేబీ పుట్టిన వెంటనే అర్ధగంట తర్వాత తల్లి తన బెస్ట్ ను పరిశుభ్రంగా కడుక్కొని ముర్రుపాలు పట్టించాలని తెలియజేశారు

పాలలో కులస్త్రం ఉండటం వలన బేబీకి వ్యాధి నిరోధక శక్తి వస్తుందని ఆ పాలు తప్పకుండా పట్టించాలని చెప్పారు తల్లిపాలు 6 నెలల వరకు తప్పకుండా పట్టించాలని తెలియజేశారు చిన్నపిల్లలకు పుట్టిన వెంటనే స్నానం చేయించవద్దని గోరువెచ్చని నీళ్లలో కాటన్ గుడ్డ తడిపి శరీరము తూడువాలి

అని మరియు పిల్లలకు వివిధ రకాల ఆయిల్ తో బాడీ మసాజ్ చేయవద్దని పిల్లల శరీరమునకు పౌడర్ చల్లవద్దని మరియు పిల్లల చెవులలో నూనెలు వేయవద్దని చలికాలం పిల్లవాని కాటన్ దుస్తులతో వెచ్చగా ఉంచాలని డాక్టర్ జయలక్ష్మి తగు జాగ్రత్తలు తల్లులకు తెలియజేశారు.

తరువాత బేబీకి పుట్టిన వెంటనే టీబీ వ్యాధి రాకుండా బీసీజీ టీకా వేయించాలని పోలియో రాకుండా పోలియో డ్రాప్స్ వేశించాలని మరియు హెపటైటిస్ బి వ్యాక్సిన్ కూడా వేయించాలని చెప్పారు తదుపరి నెల 15 రోజుల తర్వాత నెల సూదులు కార్యక్రమం మొదలవుతుంది

అప్పటినుంచి ప్రతి నెల నెల సూదులు తప్పకుండా వేయించాలని ఈ నెల సూదులు వేయించడం వల్ల పిల్లలు వ్యాధి నిరోధక శక్తి పెరిగి భవిష్యత్తులో ఎలాంటి వ్యాధులకు గురికాకుండా ఉంటారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసులు చిన్న పిల్లల డాక్టరు కూడా మాట్లాడుతూ పిల్లలకు తీసుకున్న జాగ్రత్తల గురించి

బ్రెస్ట్ ఫీడింగ్ గురించి పిల్లలకు సర్ది దగ్గు వచ్చిన వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చి చెక్ చేయించాలని పిల్లల బరువు రెగ్యులర్గా వెయిట్ పెరుగుతున్నారా లేదా అని గమనించాలని తెలియచేశారు ఈ కార్యక్రమంలో జిల్లా డిసిహెచ్ వైద్యాధికారి వరదాచారి మరియు షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాసులు మరియు ఫార్మసిస్టు ఉదయ్ కుమారు, హెల్త్ సూపర్వైజర్లు మెర్లిన్ ,అండ్ అమృత , ఆశాలు మరియు స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS