SAKSHITHA NEWS

Ganja riot in Shad Nagar

షాద్ నగర్ లో గంజాయి కలకలం
దాదాపు 110 కిలోల గంజాయిని పట్టుకున్న షాద్నగర్ ఎస్వోటీ పోలీసు
భద్రాచలం నుంచి హైదరాబాద్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం.
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఏసీపీ కుశాల్కర్.*


సాక్షిత రంగా రెడ్డి జిల్లా షాద్ నగర్ నీలగిరి ప్రతినిదీ:

షాద్ నగర్ ఏసీపీ వెల్లడించిన వివరాల ప్రకారం,,,షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ పరిధిలోని రంగ సముద్రానికి చెందిన కురువ రమేష్(30 సంవత్సరాలు),వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గూడూరు గ్రామానికి చెందిన వీరన్న మరియు భద్రాచలం జిల్లాకు చెందిన సోము రాజు ముగ్గురు కలిసి గంజాయిని భద్రాచలం నుండి హైదరాబాద్ కి రవాణా చేస్తూ పట్టుబడ్డారు.

నిందితుడు కురవ రమేష్ వరంగల్ కు చెందిన వీరన్న భద్రాచలం వెళ్లి అక్కడ సోమరాజు అనే వ్యక్తిని కలిసి అతని ద్వారా 110 కిలోల గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసుకొని కురువ రమేష్ కు చెందిన TATA TS10 EM10 7999 గల వాహనం వెనుక భాగంలో ఒకదాని మీద ఒకటి పేర్చుకొని

ఎవరికి అనుమానం రాకుండా భద్రాచలం నుండి హైదరాబాద్ కు వెళ్తూ ఎక్కడైనా పోలీసు లు పట్టుకుంటారేమోనని తెలివిగా గుంటూరు- కర్నూలు మీదుగా హైదరాబాద్ వెళ్లే క్రమంలో షాద్ నగర్ టోల్ గేట్ దగ్గర నిన్న రాత్రి 7 గంటల సమయంలో పక్క సమాచారంతో శంషాబాద్ డిసిపి మరియు షాద్నగర్ ఏసిపి పర్యవేక్షణలో రాజేశ్వర్ రెడ్డి STO శంషాబాద్,మరియు షాద్నగర్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్,ఎస్సై విజయ్ మరియు కానిస్టేబుల్.

షాద్నగర్ టోల్ గేట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తూ నిందితుడిని పట్టుకోవడం జరిగిందని ఏ సి పి కుశాల్కర్ మీడియాకు తెలపడం జరిగింది.ఇట్టి చేదనలో చాకచక్యంగా వ్యవహరించిన షాద్నగర్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్,ఎస్సై విజయ్ కుమార్ మరియు ఎస్ ఓ టి రాజేశ్వర్ రెడ్డిని అభినందించి వీరికి తగిన రివార్డులను పై అధికారుల ద్వారా ఇప్పించడం జరుగుతుందని అన్నారు…


SAKSHITHA NEWS