Expeditiously take up new municipal construction works.
మునిసిపల్ నూతన భవన నిర్మాణ పనులు త్వరగా చేపట్టండి.
*ఎమ్మెల్యే భూమన
నగరపాలక సంస్థ నూతన భవన నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
పాత మెటర్నిటీ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు నూతన మునిసిపల్ కార్యాలయం ను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం పరిశీలించారు. మేయర్ శిరీషా, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణతో కలసి ఎమ్మెల్యే అన్ని ఛాంబర్లను పరిశీలించారు. అధికారులు, ఉద్యోగుల తో మాట్లాడి అన్ని వసతులు ఉన్నాయా, ఇంకా ఏమైనా కొరత ఉందా అని అడిగి తెలుసుకున్నారు
.
అనంతరం పాత మునిసిపల్ ఆఫీస్ వద్దకు చేరుకుని అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. పనులు ఆలస్యంగా జరుగుతుండటంతో కూల్చివేత పనులు వేగంగా చేయాలని కాంట్రాక్టర్, అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు కూడా త్వరగా ప్రారంభించి నిర్ణీత గడువు లోపు పూర్తి చేయాలన్నారు.
ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు ఎస్.కె.బాబు, ఆంజనేయులు, స్మార్ట్ సిటీ జి.ఎం. చంద్రమౌళి, డి.ఈ. విజయకుమార్ రెడ్డి, దేవిక, తదితరులు ఉన్నారు.