మరణించిన హోంగార్డు కుటుంబానికి అందజేసిన జిల్లా ఎస్పీ

Spread the love

District SP handed over to the family of the deceased home guard

హోమ్ గార్డ్స్ వన్డే కాంట్రిబ్యూషన్ చెక్కును మరణించిన హోంగార్డు కుటుంబానికి అందజేసిన జిల్లా ఎస్పీ

కృష్ణాజిల్లా హోంగార్డ్స్ విభాగం నందు విధులు నిర్వర్తిస్తూ అనారోగ్య కారణాలతో హోంగార్డ్ – 741 D. రమేష్ కుమార్ మరణించగా ఆయన తోటి సహచర హోంగార్డ్స్ అందరి ఒకరోజు వేతనం 3,94,806/-రూపాయల సహాయాన్ని చెక్కు రూపంలో జిల్లా ఎస్పీ శ్రీ పి.జాషువా ఐపీఎస్ రమేష్ కుమార్ సతీమణి సుజాత కి అందజేసారు.

ఎస్పీ మాట్లాడుతూ భవిష్యత్తులో ఎలాంటి సమస్య వచ్చినా ఏ ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా తెలుపుకోవచ్చని, రమేష్ మరణించినప్పటికీ మీరంతా పోలీస్ కుటుంబ సభ్యులేనని మీకు అండగా కృష్ణా జిల్లా పోలీస్ శాఖ ఎల్లవేళలా ఉంటుందని హామీ ఇచ్చారు.

Related Posts

You cannot copy content of this page