బీరంగూడ-కిష్టారెడ్డిపేట ప్రధాన రహదారిపై నాలుగు కూడళ్ళ ఏర్పాటు

Spread the love


Construction of four intersections on Biranguda-Kishtareddypet main road

బీరంగూడ-కిష్టారెడ్డిపేట ప్రధాన రహదారిపై నాలుగు కూడళ్ళ ఏర్పాటు


ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అమీన్పూర్ 67 కోట్ల రూపాయలతో బీరంగూడ నుండి కిష్టారెడ్డిపేట ఔటర్ రింగ్ రోడ్డు వరకు నిర్మించిన 100 ఫీట్ల రహదారిలో నాలుగు ప్రధాన కూడళ్ళు ఏర్పాటు చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

సోమవారం సాయంత్రం స్థానిక ప్రజాప్రతినిధులు, హెచ్ఎండిఏ అధికారులతో కలిసి రహదారిని పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న కూడళ్ళల్లో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. 18 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న అనుసంధాన రహదారులు పూర్తయిన వెంటనే, ప్రధాన రహదారిని ప్రారంభిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ తులసి రెడ్డి, హెచ్ఎండిఏ డి ఈ దీపక్, కాంట్రాక్టర్ దామోదర్ నాయుడు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page