Speed up master plan road works
మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులను వేగవంతం చేయండి – కమిషనర్ అనుపమ అంజలి
రహదారులు పెరిగితే నగరం అభివృద్ది చెందుతుంది – డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి
తిరుపతి : మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులను వేగవంతం చేయాలని అధికారులకు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి ఆదేశాలు జారీ చేసారు. రహదారులు పెరగడం వలన నగరం అభివృద్ది చెందుతుందని డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి అన్నారు.
అంకురా హాస్పిటల్ ప్రక్కన వెలుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్డును, హిరోహోండా షోరూమ్ ప్రక్క నుండి వెలుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్లను బుధవారం సాయంత్రం కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్రనారాయణలు అధికారులతో కలిసి పరిశీలించారు. కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ కౌన్సిల్ అనుమతితో 12 మాస్టర్ ప్లాన్ రోడ్లను పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు.
మాస్టర్ ప్లాన్ రోడ్లు వెల్లే చోట్ల కొంతమంది ప్రజలకి టిడిఆర్ బాండ్లను ఇచ్చి స్థల సేకరణ కూడా దాదాపు పూర్తి చేయడం జరిగిందన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్లు త్వరగా పూర్తి చేసేందుకు అధికారులతో కలిసి పని చేయడం జరుగుతుందన్నారు. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి
నగరం అభివృద్ధి చెందాలంటె రహదారులు పెరగాలనే ఉద్దేశ్యంతో మాస్టర్ ప్లాన్ రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
మాస్టర్ ప్లాన్ రోడ్లు పూర్తి అయితే ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతుందన్నారు. తిరుపతి నగరాభివృద్దిలో భాగంగ నగరానికి తూర్పు వైపున 12 మాస్టర్ ప్లాన్ రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇప్పటికే గెస్ట్ లైన్ ప్రక్క నుండి రేణిగుంట రోడ్ హిరోహోండా షోరూమ్ వరకు వేసిన అన్నమయ్య మార్గ్, అదేవిదంగా డిబిఆర్ హాస్పిటల్ వైపు నుండి వేసిన వై.ఎస్.ఆర్ మార్గ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు నుండి కొంత మేరకు ఉపసమనం లభించందన్నారు.
మిగిలిన మాస్టర్ ప్లాన్ రోడ్లను కూడా తమ కార్పొరేటర్ల సహకారంతో కమిటీలను వేసి అడ్డంకులను అదిగమిస్తూ పనులను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ మాట్లాడుతూ తిరుపతి అభివృద్దికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తమ్ముడు గణేష్, కోటూరి ఆంజనేయులు, కో ఆప్షన్ సభ్యులు మట్లి వెంకటరెడ్డి, అదనపు కమిషనర్ సునీత, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, టౌన్ ప్లానింగ్ అధికారులు బాలసుబ్రహ్మణ్యం, షణ్ముగం, సర్వేయర్లు దేవానంద్, మురళీకృష్ణ, డిఈ మహేష్, ప్లానింగ్ సెక్రటరీలు, నాయకులు చింతలచేను గోఫి, మల్లం రవిచంధ్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.