Master plan should speed up road works – Commissioner Anupama Anjali
మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులను వేగవంతం చేయాలి – కమిషనర్ అనుపమ అంజలి.
సాక్షిత : తిరుపతి నగరంలో జరుగుతున్న జరుగుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్డు పనులను వేగవంతం చేయాలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. తిరుపతి మునిసిపల్ పరిధిలోని గొల్లవానికుంట వద్ద జరుగుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్డును శనివారం కమిషనర్ అనుపమ పరిశీలించి అధికారులకు తగు సూచనలు జారీ చేశారు.
గతవారం ఇంజనీరింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో తాను సూచించిన మేరకు పనులు ఏ విధంగా జరుగుతున్నాయని ఆమె అడిగి తెలుసుకున్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్డుకు తమ భూమిని ఇస్తున్న యజమానులకు వెంటనే ఆలస్యం కాకుండా టిడిఆర్ బాండ్లను కేటాయించాలన్నారు. మాస్టర్ ప్లాన్ రోడ్డులు పూర్తి అయ్యేంతవరకు అధికారులు పనులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
మాస్టర్ ప్లాన్ రోడ్లు నగరంలో పూర్తి అయితే నగర వాసులకే కాకుండా యాత్రికులకు కూడా ట్రాఫిక్కు ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయని కమీషనర్ అనుపమ అంజలి అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సునీత, మునిసిపల్ కార్పొరేషన్ సిటీ అసిస్టెంట్ ప్లానర్లు బాలసుబ్రమణ్యం, షణ్ముగం పాల్గొన్నారు.